ఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసుకు సంబంధించి ములుగు ఎస్పీ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తో పాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాగితే మనసులోని నిజాలు బయటకు కక్కేస్తారంటే ఇదేనేమో.. లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ అనే వ్యక్తి 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి.. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన కొన్ని వస్తువులను దోచుకెళ్లాడు. అవినాష్ పరారీలో ఉండి 30 ఏళ్ళు కింగ్ లా బ్రతికాడు. ఏదైతే నిజం చెప్పకూడనది ఉందో.. ఆ నిజాన్ని ఓ ఫంక్షన్లో ఫుల్ గా తాగి ఆ మర్డర్ గురించి బయటకక్కేశాడు.
భారతదేశం అధ్యక్షతన జరిగిన జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ మూడు రోజుల సమావేశంలో, సుస్థిర వ్యవసాయం కోసం జ్ఞానం, అనుభవం, ఆవిష్కరణల ప్రపంచ భాగస్వామ్యానికి శనివారం ప్రాధాన్యత ఇవ్వబడింది. శ్రీఅన్న సాగు, వినియోగాన్ని పెంచడానికి జీ-20 దేశాలు అంగీకరించాయి.
తెలంగాణ కమ్యూనిస్ట్‌లు దింపుడుకల్లం ఆశల్లో ఉన్నారా? బీఆర్ఎస్ నాయకత్వం తమను పూచిక పుల్లల్లా చూస్తోందన్న ఆవేదనతో రగిలిపోతున్నారా? లెఫ్ట్ పార్టీల తదుపరి అడుగులు ఎటు పడబోతున్నాయి? ఎవరో ఒకరితో అంటకాగక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ పార్టీవైపు చూస్తున్నారు? తెలంగాణ కమ్యూనిస్టులు పొలిటికల్ క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారు. ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోవడం ఒక సమస్య అయితే… ఎటు వెళ్తే ఏమవుతుందోనన్న భయం కూడా వాళ్ళని వెంటాడుతోందట. మునుగోడు ఉప ఎన్నిక వరకు కారు వెనకే పరుగులు పెట్టారు కమ్యూనిస్టులు.…