Student Suside: క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఎన్నో ఆశలతో బతుకుతున్న తల్లిదండ్రులకు దుఖాన్ని మిగులుస్తున్నారు. కారణమేదైనా సరే మందలిస్తే చాలు.. ఆలోచించకుండా పోయి శవమై మిగులుతున్నారు. తెలిసి తెలియని వయసులో యువత ఇలా ప్రాణాలు తీసుకుంటుంటే.. అటు తల్లిదండ్రులు మాత్రం పుట్టెడు దు:ఖంలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంట్లో గొడవ పడి క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థి రాహుల్.
Read Also: Mumbai: కదులుతున్న ఆటోలో ప్రియురాలి గొంతు కోసి పారిపోయిన ప్రియుడు
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న విద్యార్థి రాహుల్ ఇంట్లో గొడవ పడి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ధనలక్ష్మి ఫర్టీ లైజర్ షాపులో పురుగుల మందు కొనుగోలు చేసి పక్కనే ఉన్న పర్వతపురం గుట్టల్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం రాహుల్ ఇంటికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నట్లు తెలిపాడు. దీంతో సకాలంలో స్పందించిన తల్లిదండ్రులు సుధాకర్ సరితలు ఘటనా స్థలానికి చేరుకుని పురుగుల మందు తాగిన రాహుల్ ను 108 అంబులెన్స్ సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also: Bobbatlu : ఈ పండుతో బొబ్బట్లు ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అదుర్స్ అంతే..
అయితే తన కొడుకుకు పురుగుల మందు అమ్మినందుకు గాను మందుల షాప్ ముందు రాహుల్ తల్లిదండ్రులు బైఠాయించారు. తమ బంధువులతో తమకు న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగారు. అయితే ఫర్టిలైజర్ షాప్ ముందు తమ ఆందోళన వ్యక్తం చేస్తుండగానే.. రాహుల్ తల్లిదండ్రులకు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. తమ కుమారుడు రాహుల్ మృతి చెందాడని కాల్ రావడంతో రాహుల్ కుటుంబం సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మైనర్ బాలుడికి పురుగుల మందు అమ్మిన పర్టిలైజర్ షాపు యజమాని పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరారు.