DA Increase: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. కనీస వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షనర్లతో పాటు 7.28 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. జూన్ నెల వేతనంతో పాటు పెంచిన డీఏను చెల్లిస్తామని ప్రభుత్వం తన ఉత్వర్వుల్లో తెలిపింది. పెండింగ్ లో ఉన్న 3 డీఏల్లో ఒక డీఏ ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన డీఏ ఈనెల నుండే అమలు అవుతుందని తెలిపారు.
Read Also: Malli Pelli: నరేష్- పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ ఓటిటీలోకి వచ్చేస్తోంది
అంతేకాకుండా జనవరి 2022 మే 2022 వరకు బకాయిల చెల్లింపుకు సపరేట్ ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రభుత్వం. డీఏ పెంపుతో పార్ట్ టైం అసిస్టెంట్స్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ల జీతం వంద రూపాయలు పెరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన డీఏపై PRTU హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి హరీష్ రావు డీఏ పెంపుపై ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. బేసిక్ పే / పెన్షన్‌పై 2.73% విడుదల చేయనున్నది. ఇది జూన్ 2023 నుండి అమల్లోకి వస్తుంది. జూలై 2023లో వేతనంతో కలిపి చెల్లించబడుతుందని మంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రూ.1380.09 కోట్ల అరియర్స్ చెల్లింపుతో పాటు.. నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనున్నది. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7.28 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.