అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే కేటీఆర్ 'X'లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో కన్జ్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డ్రై గంజాతో పాటు మొదటిసారిగా ఓషియన్ గంజా పట్టుబడింది.
కేసీఆర్, కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, మిత్తిలు కట్టడం ఇబ్బందిగా ఉందన్నారు. రైతు కళ్లలో ఆనందం చూసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వ్యాఖ్యలు నమ్మే విధంగా లేవని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్యెల్యే చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు గైర్హాజరు అయ్యారు. అనారోగ్య కారణంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం అందించారు మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చెప్పారు.
కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి.. స్వయంగా కేటీఆరే కార్ రేసింగ్కి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు.. తనను కాపాడుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని అన్నారు.
హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి ఆరోపించారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు గ్రామాస్తులు చుక్కలు చూపించారు. ఫార్మా కంపెనీని గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అభిప్రాయ సేకరణకు వచ్చిన రెవెన్యూ సిబ్బందితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.
వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. టీడీపీ- జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీ ది 10 శాతం కూడా లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా.. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలనా అంటూ ప్రశ్నించారు.
ఈ బడ్జెట్ గత ఐదేళ్లలో జరిగిన దాన్ని సరిచేస్తూ ఇచ్చిన బడ్జెట్ ఇది అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రూ.18,421 కోట్లతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ఇచ్చారని వెల్లడించారు. గత బడ్జెట్ కంటే 23 శాతం ఎక్కువ ఆరోగ్యశాఖకు కేటాయించారన్నారు.