Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ పార్టీపై పొలిటికల్ సెటైర్స్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజగా ఈ విడుదలైన ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ సాంగ్ మరియు అందులోని డైలాగులు ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే, ఈ వార్తలను దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ఖండించారు.
Also Read : PEDDI : పెద్ది సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
సినిమా వేరు, రాజకీయం వేరు అనే సూత్రాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతారని హరీష్ శంకర్ తెలిపారు. షూటింగ్ ప్రారంభంలోనే పవన్ తమకు ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. “సినిమాలో రాజకీయాల జోలికి వెళ్లొద్దు, ఏ వ్యక్తిని లేదా ఏ పార్టీని టార్గెట్ చేయకూడదు” అని పవన్ స్వయంగా చెప్పినట్లు హరీష్ స్పష్టం చేశారు. కేవలం వినోదం పంచడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. రాజకీయంగా విభిన్న ధృవాలు అయినప్పటికీ, నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. “రాజకీయ విభేదాలు ఉన్నా, నటన విషయంలో పవన్ కళ్యాణ్ గారి ప్రొఫెషనలిజం అద్భుతం. ఆయన వ్యక్తిగత భావజాలాన్ని సినిమా సెట్స్‌లోకి తీసుకురారు” అని కొనియాడారు. ఈ సినిమాలో ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం లేదని, కేవలం ప్రేక్షకులను అలరించడానికే కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు రాశామని హరీష్ శంకర్ తెలిపారు. కాబట్టి, సోషల్ మీడియాలో వస్తున్న పొలిటికల్ సెటైర్ల వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!