పెళ్లి భోజనాలు చేసి ఆసుపత్రి పాలైన 150 మంది
పెళ్లి అనగానే చాలా మంది వధూవరుల గురించి కాకుండా అక్కడ వండే వంటకాల గురించి ఆలోచిస్తారు. రకరకాల పుడ్ ఐటమ్స్ ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకంగా తినడం కోసం వెళ్లే వారు కొందరు ఉంటారు. కుటుంబ సమేతంగా కూడా పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి అనంతరం భోజనాల దగ్గరకు వెళతారు. అయితే శుభకార్యం జరిగిన పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి భోజనాలు తిని 150 మంది ఆసుపత్రి పాలయ్యారు. కర్ణాటకలోని బెలగావిలో ఈ ఘటన జరిగింది. హిరేకోడిలోని చెకోడి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. బంధు, మిత్రులతో పాటు గ్రామంలోని చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకకు హాజరైన చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. భోజనం చేసిన రెండు గంటల తర్వాత వీరందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో వీరందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేపించారు. భోజనాల్లో కల్తీ జరగడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వంట పదార్థాలను, అలాగే వాటర్ ని కూడా పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స అందించడం కోసం గ్రామంలోని ఎమర్జెన్సీ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు. భోజనాలు తినడం వల్ల అస్వస్థతకు గురైన వారందరూ మొదట బెలగావిలో ఉన్న హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు.
ప్రధాని మోడీ ఆ విషయంలో అబద్దం చెప్పారు
చైనా-భారత్ సరిహద్దు వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై ఫైర్ అయ్యారు. భారతదేశంలో ఇంచు కూడా చైనా కబ్జా చేయలేదంటూ మోడీ అన్నీ అబద్దాలే చెప్పారంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయం లడ్డాఖ్ లో ఉన్న ప్రజలకు కూడా తెలుసునన్నారు. మన భూమిలో మన ప్రజలను కూడా ఆ ప్రాంతంలోకి చైనా అనుమతించడం లేదని, ఆఖరికి వారి పశువులను గడ్డి మేయడానికి కూడా అక్కడికి రానివ్వడం లేదని పేర్కొన్నారు. తాను కొన్ని రోజుల క్రితం లద్దాఖ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గమనించానని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని మోడీని కోరానని, అయిన ఆయన అబద్దాలలో ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ తప్పుబట్టారు.
పవన్ పుట్టిన రోజున సామాజిక కార్యక్రమాలు
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కేడర్ కు సూచించారు. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేయాలని, రెల్లి కాలనీల్లో పవన్ బర్త్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేయాలని, పేద విద్యార్థుల హాస్టళ్లను సందర్శించి పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులు అందించాలని, దివ్యాంగులకు ఉపకరణాలను సాయం చేయాలని జనసేన కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్యనాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మనోహర్…..సేవా కార్యక్రమాల వివరాలను అందించారు..ముఖ్యంగా ఐదు రకాల సేవా కార్యక్రమాల ద్వారా పేదవారికి ఉపయోగపడాలన్నారు.సెప్టెంబర్ రెండో తేదీ శనివారం నాడు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మెగా రక్తదానశిబిరం నిర్వహించనున్నారు…పార్టీ ముఖ్యనేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొనాలని మనోహర్ సూచించారు…నాదెండ్ల మనోహర్ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనున్నారు.ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
వాతావరణశాఖ కీలక అప్డేట్.. సెప్టెంబర్ 2 తర్వాత భారీ వర్షాలకు ఛాన్స్
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ లేకుండా పోయింది. ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. జూన్ నెలలో వర్షాలు సరిగా కురవలేదు. దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదైంది. ఇక జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక ఆగస్టు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలులు దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు లేక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.
1972 ఆగస్టు తర్వాత తెలంగాణలో అత్యల్ప వర్షపాతం ఈ ఏడాది ఆగస్టులో నమోదైందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం ఆగస్టులో రాష్ట్రంలో సగటు వర్షపాతం 74.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 1972లో 83.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఆగస్టులో 74.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.
ఆర్టికల్ 370పై సుప్రీం విచారణ.. ఇతర రాష్ట్రాలను కూడా విభజిస్తారా? అంటూ ప్రశ్న
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఆలోచనకు 2019 ఫిబ్రవరి నాటి పుల్వామా ఉగ్రదాడి కారణమైందని సొలసిటరీ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న నాటి ఘటన.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలనే ఆలోచనకు బీజం వేసిందని తెలిపారు. ఇక ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటివి కేవలం జమ్ము కశ్మీర్‌కే పరిమితం కాలేదని, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలలో ఇవి ఉన్నాయని మరి వాటి పరిస్థితి ఏంటి వాటిని కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తారా అని దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆ అధికారం కేంద్రానికి ఉందా అని ధర్మాసనం అడిగింది. కేవలం సరిహద్దు కనుకే ఇలా విభజించాం అనే సమాధానం మాత్రం చెప్పకండంటూ జస్టిస్ కౌల్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై భారతప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారం ఉందని కేంద్రప్రభుత్వం ఒప్పుకున్న తరువాత ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయదని ఎలా నిర్దారిస్తారని ప్రశ్నించారు.
బాధాకరం.. ఎన్టీఆర్ పేరుతో చెల్లని నాణెమా?
ఎన్టీఆర్‌కు భారతరత్న విషయం పక్కకు తప్పించారని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్టీఆర్‌కు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుతో చెల్లని నాణెం తీసుకురావడం బాధాకరమని లక్ష్మీపార్వతి అన్నారు. సోషల్ మీడియాలో చెల్లని నాణెం అని ఎగతాళి చేస్తుంటే.. కన్నీళ్లు వస్తున్నాయని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ఎన్టీఆర్‌కు చేసే ఉపకారం? వ్యాపార కోణంలో ఎన్టీఆర్‌ను ఇలా వాడుకోవడం చాలా దారుణం అని ఆమె ధ్వజమెత్తారు.
అంతేకాకుండా.. ‘నేను ఎన్టీఆర్కు అధికారికంగా భార్యను అవునా? కాదా? చెప్పాలి’ అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం నుంచి పురందేశ్వరిని తరమికొట్టే వరకు వైసీపీ తరఫున పోరాటం చేస్తానన్నారు. లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ తనను అధికారికంగా వివాహం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తనను ఇల్లీగల్గా పెట్టుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలోని సొంత కార్యక్రమం అయి తనను ఆహ్వానించకపోయినా పట్టించుకునేదాన్ని కాదన్నారు లక్ష్మీపార్వతి. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని అన్నారు. ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వాని అందాల్సిందన్నారు.ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఆరోపించారు లక్ష్మీపార్వతి. దీనిపై ఆమె అభ్యతరం వ్యక్తం చేశారు.
నేడే మంత్రి మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ..
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న పట్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పట్నం సచివాలయం మొదటి అంతస్తులోని కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం సమాచార శాఖ అధికారులు మంత్రి మహేందర్‌రెడ్డిని కలిసి సన్మానించారు. సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన ఈ నెల 24న రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. 1994 నుంచి తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి మహేందర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు.
పాతబస్తీలో దారుణం.. నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారం
పాతబస్తీలో చికిత్స నెపంతో నవ వధువుపై కపట బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని తలాబ్ కట్టా నివాసి హాజీతో మూడు నెలల క్రితం వివాహమైంది. అయితే వధువు ఆరోగ్యం కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణించింది. బాలిక ఆరోగ్యం విషమించడంతో అత్తమామలు ఆమెను బండ్ల గూడా ప్రాంతంలో నివసించే మజార్ బాబా వద్దకు తీసుకెళ్లారు. వధువు శరీరంపై ఐదు దయ్యాలు ఉన్నాయని అది వదిలించాలని లేదంటే ప్రమాదమని వధువు అత్త మామలకు నమ్మించాడు. దీంతో వారు భయపడి దయ్యాలను వదిలించాలని కోరారు. అయితే ఇదే అలుసుగా భావించిన నకిలీ బాబా అత్త మామలకు బయటనే ఉండమని చెప్పి నవ వధువును తీసుకుని ఓ గదిలో తీసుకుని వెళ్లాడు. ఆమెకు భయపడాల్సిన అవసరం లేదని ఏం జరిగినా అరవకూడదని చెప్పి వధువు కళ్లకు గంతలు కట్టి అనంతరం దొంగ బాబా బాలికపై అత్యాచారం చేశాడు. ఏమీ తెలియనట్లు దయ్యాలు వదిలించానని నమ్మించాడు. అత్తమామలు వధువును తీసుకుని ఇంటికి వచ్చారు.
ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు, అనురాగానికి చిహ్నం రాఖీ వేడుక. అయితే.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను!’ అని ఆయన పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. నేడు సీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగ్గంపేట మండలం ఇర్రిపాక చేరుకుంటారు. అక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసంలో ఆయన కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు.అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ప్రజల దృష్టిని మళ్లించే పనిలో డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్, తైవాన్‌పై దాడికి ప్లాన్ చేస్తుందా..?
డ్రాగన్ కంట్రీ చైనా తన జిత్తులమారి వేషాలు తగ్గించుకోవడం లేదు. సరిహద్దుల్లో ఉన్న అన్ని దేశాలతో చైనా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, ప్రపంచ స్థాయిలో భారత్ ఎదుగుదలను చైనా జీర్ణించుకోలేకపోతోంది. సరిహద్దు సమస్యలతో భారత్ ను చికాకు పెట్టాలని చూస్తోంది. అందుకే భారతదేశంలో అంతర్బాగంగా ఉన్న ప్రాంతాలనున తనవిగా చెప్పుకుంటోంది. భారత్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, సరిహద్దు సమస్యలతో సతమతమయ్యేలా ప్లాన్ చేస్తోంది.
చైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. అక్కడ కంపెనీల్లో వేతనాల పెంపు లేదు. ఉద్యోగుల కోత వల్ల అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ ప్రజల్లో షి జిన్ పింగ్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఢమాలైంది. బ్యాంకులు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు విదేశీ కంపెనీలు చైనా నుంచి నెమ్మదిగా వేరే దేశాలకు ముఖ్యంగా ఇండియా, ఇండోనేషియా దేశాలకు తరలివెళ్తున్నాయి. గత కొద్ధి రోజుల్లో 10 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి.
అన్నా చెళ్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనది
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకోని రాజ్‌భవన్‌లో రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్ భవన్ లో జరుగుతున్న రాఖీ ఫర్ సోల్జర్స్ ఎంతో ముఖ్యమైన కార్యక్రమమని, అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు …ప్రజలంతా కూడా రక్షా బంధన్ జరుపుకుంటున్నామన్నారు. దేశంలో ఎన్నో సంస్కృతి లు…ఎన్నో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ…అంతా కలిసి మెలిసి ఉంటామని, అన్నా చెళ్లెల్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదని ఆమె వ్యాఖ్యానించారు.