టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లీతో రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది.
టీడీపీ నేత నారా లోకేష్పై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రెండు కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు.
తెలంగాణకు హైదరాబాద్ వాతావారణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇంటి పెండింగ్ బిల్లులను కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ రుణన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేలు చెల్లించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందని తెలిపారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కా తమ్ముడిపై శివకుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్లో దొరికిపోయినట్లయింది చంద్రబాబు పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడు అంటూ ఆయన ప్రశ్నించారు.
ముందస్తు సార్వత్రిక ఎన్నికలను పిలిచే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పదవీ కాలం చివరి రోజు వరకు భారత పౌరులకు సేవ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.