ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మల్టిపుల్ డిజేబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల బైపిళ్ళ నారాయణ నిఖిల్కు సీఎం జగన్ ఆర్థిక సహాయం చేశారు.
సమస్యల పరిష్కారానికి ఆయుధాలు ఉపయోగించే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయని, అయితే ఇక్కడ హింసను అరికట్టేందుకు చర్చలు, సహన సంస్కృతిని అవలంభిస్తున్నామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిపై ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు వారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం (సెప్టెంబర్ 2) నోటిఫికేషన్ విడుదల చేసింది. రామ్నాథ్ కోవింద్ ఛైర్మన్గా ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఛత్తీస్గఢ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని 'ఆరోప్ పత్ర' పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ను ఉద్దేశించి రాహుల్ బాబాయ్ గిరిజనులకు ఏం చేశారో చెప్పాలని అమిత్ షా ప్రశ్నించారు.