ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో వారిని పక్కనపెట్టడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు.
అమరావతిలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే అంశంపై రేపటి సభలోనూ పట్టు పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇవాళ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, స్పీకర్ తమ్మినేని కామెంట్లపై సమావేశంలో చర్చించారు.
వికారాబాద్ జిల్లా కోటపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఇచ్చిన 6 గ్యారంటీ డిక్లరేషన్ లను కర్ణాటకలో ముందు అమలు చేయాలన్నారు. breaking news, latest news, telugu news, patnam mahender reddy, congress,
గత రెండు నెలల క్రితం దేశ వ్యాప్తంగా మంట పుట్టించిన టమాటా.. ఇప్పుడు చవకై పోయింది. కిలో రూ.300కు పలికి చుక్కలు చూపించి.. ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కిలో టమోటా రూ. 2 కూడా పలకడం లేదు.
గణేష్ నవరాత్రోత్సావలు వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా తేడాలేకుండా.. అందరూ సంతోషంగా జరుపుకుంటారు. అయితే.. వివిధ ప్రత్యేక ఆకర్షణలతో ఘననాథుడిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తుంటారు. breaking news, latest news, telugu news, big news, Green ganesha idol,
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు సాయంత్రమే దీనిపై తీర్పు వస్తుందని అంతా భావించారు. మొదట ఈ కేసు తీర్పును 10 నిమిషాలు వాయిదా వేసిన న్యాయమూర్తి.. ఆ తరువాత రేపు తీర్పు వెల్లడిస్తానని తెలిపారు.
ఫంక్షన్ హాళ్లలో వేడుకల సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలను కలుపుకొని స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యే ఇతర కార్యక్రమాలలో వంట చేయడానికి, వడ్డించడానికి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను అందించే టెంట్ హౌస్‌ల తరహాలో స్టీల్ బ్యాంక్‌లు పనిచేస్తాయి. breaking news, latest news, telugu news, Steel Banks, big news,
ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'X' వేదికగా ఆయన మండిపడ్డారు. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ! అంటూ వార్నింగ్ ఇచ్చారు.
వన్డేలలో ఆడటానికి బౌలింగ్ ఒక్కటే సరిపోదని.. బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా ముఖ్యమని అమిత్ మిశ్రా అన్నాడు. అశ్విన్ మంచి బౌలర్, వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పాడు. కానీ వన్డేల్లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి తీసుకోరని.. 40 ఓవర్ల ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుందని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.