చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల, నవాబుపేటలో రూ. 21 కోట్ల 49 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సురంగాల్ లో శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణా పథకాలను దేశంలోని కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కాపీ కొడుతున్నారన్నారు. దేశం తెలంగాణా వైపు చూస్తుంటే… ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి విమర్శించారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు.
Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది
ఎన్నికల అప్పుడే గ్రామాల్లో తిరుగుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రజలు నమ్మరని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వేలకోట్లతో అభివృద్ధి సాగుతుందని, సంక్షేమ పథకాలు సైతం అలానే అమలవుతున్నాయని వెల్లడించారు. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఉందని.. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎక్కడున్నాయని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజలు సీఎం కేసీఆర్ ను మరో మారు దీవిస్తారని, ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా యాదయ్యను, ఎంపీగా రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
Muthireddy Yadagiri Reddy: ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా
ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాగుతుందని చెప్పారు. వ్యక్తిగత పథకాలు పేదరిక నిర్మూలనకు తోడ్పడుతాయని చెప్పారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాగుతుందని అందుకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు మరో మారు తనను దీవించాలని కోరారు.