భారత ఎన్నికల సంఘం గురువారం (అక్టోబర్ 26) నటుడు రాజ్‌కుమార్ రావుకు కీలక బాధ్యతను అప్పగించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రాజ్‌కుమార్‌రావును కమిషన్ జాతీయ ఐకాన్‌గా నియమించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తరఫున జాతీయ ప్రచారకర్తలుగా వ్యవహరించనున్న నేషనల్ ఐకాన్లలో ఒకరిగా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు నియమితులయ్యారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలలో.. మహారాష్ట్రకు చెందిన కొంతమంది రైతుల పేరుతో రాజకీయాలు చేశారని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు.
తమిళనాడు రాజ్‌భవన్ వద్ద పెట్రోల్ బాంబు విసిరిన ఘటన కలకలం రేపిన విషయం విదితమే. చెన్నైలోని రాజ్‌భవన్ ప్రధాన గేటు వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ సీసాను విసిరేశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలపై గురువారం ఈడీ దాడులు చేపట్టగా.. మరోవైపు సీఎం గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు.
మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి ఈరోజు భారత ఆర్మీ దళాలు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో బెంగళూరు-హైదరాబాద్ (ఎన్‌హెచ్ 44)లో గురువారం నాడు నిలిచిన ట్యాంకర్‌ను వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ ఢీకొనడంతో పదమూడు మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి breaking news, latest news, telugu news, cm jagan, chikballapur