డిసెంబర్లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. క్రిస్ గేల్, గంబీర్, షేన్ వాట్సన్.. ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖలో మ్యాచ్‌లు ఆడబోతున్నారని ఆయన తెలిపారు.
హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి.
అయోధ్యలో రామ మందిరం త్వరలో సిద్ధమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. ఆలయ నిర్మాణంలో హిందూ ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్యుల సహకారాన్ని కొనియాడారు.
ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కద్యన్‌పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం కింద అభియోగాలు మోపారు.
Visakhapatnam: పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కన్న వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళ పిల్లలు మాత్రం బాగుండాలి అని ఆరాటపడుతుంటారు. పిల్లలు బాగుంటే చాలని సర్వం పిల్లల కోసం త్యాగం చేస్తారు. ఆడపిల్లల విషయానికి వస్తే ముఖ్యంగా తండ్రి అన్నీ తానై అపురూపంగా చూసుకుంటాడు. ఒక వ్యక్తి ఎంతటి కసాయి వాడైనా కన్న కూతురిని మాత్రం మహారాణిలా భావిస్తాడు . కింద పెడితే చీమలు కుడతాయి.. పైన పెడితే గ్రద్దలు ముడతాయి అన్నట్లు అల్లారుముద్దుగా పెంచుకుంటాడు.…
తీవ్రమైన న్యుమోనియా, ఏఆర్‌డీఎస్‌తో బాధపడుతూ అత్యున్నత స్థాయి వెంటిలేటర్ మీద ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రక్షించడం ద్వారా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం, నిబద్ధతను చాటుకుంది.
023 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఈనెల 29న లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి భారత్ లక్నోలో భారీ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది.
Telangana: మనం అనారోగ్యం బారిన పాడినప్పుడు మనకు మొదట గుర్తుకు వచ్చేది డాక్టర్లు. ఎందుకంటే ఎలాంటి సమస్యకైనా వైద్యం చేసి ప్రాణాలను నిలిపేందుకు ప్రయత్నిస్తారు డాక్టర్లు. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యం చేసే డాక్టర్ దేవునితో సమానం. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో కూడా వైద్యులు చికిత్స చేసి పోతున్న ప్రాణాన్ని నిలుపుతారు. అయితే డబ్బుల కోసం తెలిసి తెలియని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వైద్యులు కూడా ఉన్నారు.…