త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం..
అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని, దేశ చరిత్రలోనే 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల అప్పు చేసి ఇరిగేషన్ మీద ఖర్చు చేసిందని తెలిపారు. పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నుంచి ఒక ఎకరంకు కూడా నీళ్ళు పారలేదన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్‌లు కూలిపోయాయని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ సంవత్సరం రూ.22,500 కోట్లను ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తున్నామన్నారు.
రాజ్యాంగం అంటే సంఘ్‌బుక్ కాదు.. సంవిధాన్!
భారత దేశంలో రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. ఇందులో విపక్షాల తరఫున వాయనాడు ఎంపీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా చర్చను స్టార్ట్ చేశారు. తొలి ప్రసంగంలోనే అధికార ఎన్డీయేపై విమర్శలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే మన స్వాతంత్ర్య పోరాటం చాలా ప్రత్యేకమైందన్నారు. సత్యం, అహింస అనే పునాదులపైనే మనం పోరాటాం చేశామని ఆమె తెలిపారు. అయితే, భారత స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం.. దాని నుంచి ఉద్భవించిందే రాజ్యాంగం అన్నారు. ఇది కేవలం డాక్యుమెంట్ కాదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మౌలానా ఆజాద్ లాంటి లాంటి వారు ఎంతో మంది ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
అప్పుడు బతుకమ్మ ఎత్తుకున్నారు.. ఇప్పుడు ఎందుకు అంటున్నారు..
తెలంగాణ తల్లి చేతులో బతుకమ్మ ఎందుకు? అనే ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గతంలో ఇందిరా గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ తల్లి చేతులో బతుకమ్మ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకి మాత్రం తెలంగాణ పండుగలు గుర్తుకు వస్తాయని కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు, పరిణామాలు పై రేపు సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
వికసిత భారత్‌లో భాగమే స్వర్ణాంధ్ర@2047.. సీఎం ఓపికని మెచ్చుకోవాలి..
వికసిత భారత్‌లో భాగమే స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.. సైబరాబాద్ ఛీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.. సీఎం చంద్రబాబు ఓపికని చాలా మెచ్చుకోవాలి.. సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నేనేదో అయిపోవాలని కలలు కనలేదు.. నా కలల సారథిగా చంద్రబాబు తప్ప ఎవరూ కనపడలేదన్నారు.. కోట్లాది ప్రజలకు బలంగా మారారు చంద్రబాబు.. నేను పార్టీలో బాగా నలిగిన తరువాత చంద్రబాబు పైన గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. ప్రత్యర్ధుల దాడిని తట్టుకుంటూ పని చేయాలి.. 24 గంటల సమయంలో చంద్రబాబు ఎలా బాధ్యతలు నిర్వహిస్తున్నారా? అనిపిస్తుందన్నారు..
ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ళ గ్రామపంచాయతీకి రాష్ట్రపతి అవార్డు
ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గ్రామపెద్దలు. నందిగామ నియోజకవర్గం చంద్రళ్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామ సర్పంచ్ కుసుమ రాజు వీరమ్మ, ఉప సర్పంచ్ నల్ల రవి, పంచాయతీ కార్యదర్శి సాయిరాం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో ముప్పాళ్ల గ్రామాన్ని సామాజిక న్యాయం, సోషల్ సెక్యూరిటీ పంచాయతీ విభాగంలో అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే అనకాపల్లి జిల్లా న్యాయంపూడి, అనకాపల్లి జిల్లా తగరంపూడి పంచాయతీలు కూడా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను అందుకున్నాయి.
అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ ను తరలించి గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అల్లుఅర్జున్‌కు వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం నాంపల్లి కోర్డుకు తరలించారు.
సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యం
చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్ అని.. ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా.. రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో రూ.861 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో దాదాపు రూ.21 కోట్లతో 1313 కి.మీ రహదారుల మరమ్మతు పనులు చేపట్టామన్నారు. త్వరలో 1300 కి.మీ రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం రోడ్లను రెన్యువల్ చేయకపోవడంతో నేడు అదనంగా ప్రభుత్వంపై 15 వేల కోట్ల భారం పడిందన్నారు. మోడీ, బాబు, పవన్ త్రయం ఆధ్వర్యంలో రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం వస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీని ట్రబుల్ ఐటీగా మార్చింది
గత ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీని ట్రబుల్ ఐటీగా మార్చిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇవాళ ఆమె నిర్మల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మసగ బారిన ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను ఉన్నత స్థితికి తీసుకెళ్లుతామన్నారు. తక్షణ అవసరాల కోసం కోటి రూపాయల నిధులు కేటాయించామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు పలు సమస్యలను అదృష్టం తీసుకొచ్చారని, వాటన్నింటినీ వీలైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు మంత్రి సీతక్క. ఫుడ్ కాంట్రాక్టర్ డ్రైనేజీ లాప్టాప్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. అంతేకాకుండా.. విద్యార్థులు ఆత్మహత్యల వైపు వెళ్లకుండా మానసిక స్థైర్యాన్ని నింపడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
భార్యల వేధింపులు.. వరకట్నం చట్టం సెక్షన్ 498ఏ రివ్యూపై సుప్రీంకోర్టులో పిల్..
బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపులు, గృహ హింస చట్టాలు సెక్షన్ 498-ఏ ని సమీక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భర్త, అతడి ఫ్యామిలీని వేధించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెబుతున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని, ఆయన భార్య నిఖితా సింఘానియాని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ కేసు నేపత్యంలో తప్పుడు వరకట్నం, గృహ హింస చట్టాలపై సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలలైంది. చట్టాలను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, లాయర్లు, లీగర్ జూరిస్టులతో కమిటీ ఏర్పాటు చేయాలని లాయర్ విశాల్ తివారీ కోరారు.
మా తప్పేం లేదు.. సంధ్య థియేటర్ లెటర్ లీక్!!
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమైన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. పోలీసులు ముందు నుంచి సంధ్య థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని చెబుతూ వచ్చారు. కానీ ప్రీమియర్ షో కి రెండు రోజుల ముందే అంటే రెండవ తేదీన అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ ఉండే అవకాశం ఉండడంతో పోలీసు భద్రత కోరుతూ సంధ్య థియేటర్ పోలీసులకి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లేఖ ప్రకారం అసలు సంధ్య థియేటర్ ది కానీ అల్లు అర్జున్ ది కానీ తప్పు లేదని పూర్తిస్థాయిలో భద్రత కల్పించలేని పోలీసులదే తప్పని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్ సహా సంధ్య థియేటర్ యాజమాన్యానిదే తప్పు అంటూ చెబుతూ వస్తున్నారు. మరోపక్క ఈ కేసులో అల్లు అర్జున్ ని 11వ నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ మీద ప్రస్తుతానికి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.