Varun Tej : మెగా ప్రిన్స్ తో కోలీవుడ్ డైరెక్టర్ సినిమా ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కోరియన్ కనకరాజు’ సినిమా షూటింగ్‌ను దాదాపు పూర్తి చేశారు. యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, దీని తర్వాత వరుణ్ చేయబోయే సినిమాలు కొంత మేర ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి.
Also Read : Prabhas : పీపుల్ మీడియాని ఆదుకునేందుకు రెబల్ స్టార్ రెడీ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ దగ్గర పనిచేసిన బాలాజీ అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదొక పూర్తిస్థాయి ఎంటర్టైనర్ అని సమాచారం. బాలాజీ చెప్పిన స్క్రిప్ట్ వరుణ్ తేజ్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాలెంటెడ్ తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. బాలాజీ చెప్పిన కథాంశం మరియు ప్లాట్ పట్ల ఇంప్రెస్ అయిన కార్తీక్ సుబ్బరాజ్, తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమాలో సహ నిర్మాతగా కూడా భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం ఆయన కూడా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో కూడా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఎదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే పట్టాలెక్కనున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..