భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో ఆయన్ను అపోలో హస్పటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా.. ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు తాజా సమాచారం అందించాయి. ‘వార్తా సంస్థ ANI ప్రకారం.. అద్వానీని ICUలో చేర్చారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అపోలో ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.’
Read Also: Ponguleti Srinivas Reddy: కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ఇంటిగ్రేట్ పాఠశాలలు
ఈ ఏడాది ప్రారంభం జూలై 4న అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. దానికి కొద్ది రోజుల ముందు, చికిత్స కోసం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తీసుకెళ్లారు. ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం మరుసటి రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత.. ఆగస్టు 6న కూడా ఆసుపత్రిలో చేరాడు. అయితే, రొటీన్ చెకప్ కోసం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ తెలిపారు. అద్వానీ 1927లో కరాచీలో (ప్రస్తుతం పాకిస్థాన్) జన్మించారు. 2002 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నారు. అద్వానీ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వాలంటీర్‌గా ప్రారంభించారు. 2015లో అద్వానీకి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ లభించింది. 2024లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.
Read Also: PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి