Soma Bharath : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కాంగ్రెస్ ఉల్లంఘిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని, చట్టాన్ని, ఈసీని బేఖాతరు చేస్తోందన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ సోమ భరత్. ఇవాళ రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన ఆయన మాట్లాడుఊ.. సీఈఓకు నాలుగు ఫిర్యాదులిచ్చామని తెలిపారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దురదృష్టవశాత్తు ఈసీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. అందుకే ఆయన రెచ్చిపోతున్నారన్నారు. కేసీఆర్ శిరచ్చేదం చేయాలని రేవంత్ అంటున్నారని, తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే భాష మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికలంటే హింసను రెచ్చగొట్టడమేనా? అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా..’తొమ్మిదిన్నరేళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? రేవంత్ మాటలకు కాంగ్రెస్ లో ఉన్నవాళ్లు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈసీని గతంలోనే కోరాం. ఇప్పటికే అనేకసార్లు ఈసీకి ఫిర్యాదు చేశాం. ఐనా, ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నారు? బీఆర్ఎస్ హింసను ఎట్టి పరిస్థితుల్లో సహించదు. సీఈఓకు అన్ని విషయాలు వివరంగా చెప్పాం. వెంటనే చర్యలు తీసుకోపోతే వ్యవస్థ అరాచక శక్తుల చేతుల్లోకి పోతుందని కూడా విన్నవించాం. నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ చట్టాన్ని ఉల్లంఘించి అసత్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. దొంగ ఛానళ్ల ముసుగులో దొంగ మనషులు బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. 28 ఛానళ్ల వివరాలు ఈసీకి ఇచ్చాం. వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాం. కాంగ్రెస్ తెరవెనుక ఉండి సునీల్ కనుగోలు లాంటి వాళ్లు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు. సునీల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాం. రేవంత్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రచారానికి దూరం పెట్టాలని కోరాం. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డిని తొలగించాలని కోరాం. క్యూన్యూస్ లో కాంగ్రెస్ కు నేరుగా ప్రచారం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరాం. స్టడీఐక్యూ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోంది, చర్యలు తీసుకోవాలని కోరాం.’ అని సోమ భరత్ వెల్లడించారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!