బీజేపీ మేనిఫెస్టో సంక్షేమం కోసం అయితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు సంక్షోభాన్ని సృష్టించేవన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్య, వైద్యం అందరికీ లభించేలా మా ప్రణాళిక రూపొందించామని, ప్రతి వ్యక్తి తన కాళ్ల మీద నిలబడి నలుగురికి ఉపాధి కల్పించేలా ఉండాలన్నారు లక్ష్మణ్. ప్రభుత్వం మీద ఆధారపడి ప్రజలు బతికేలా ఉండకూడదని, ఉచితాల పేరుతో ఓట్లు కోసం పార్టీలు పడుతున్న పాట్లు అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని, గ్యారంటీలు గాంధీ కుటుంబానికి లాభం చేకూర్చేవేనన్నారు.
Rajkumar Hirani: ఒక్క ప్లాప్ కూడా లేని డైరెక్టర్.. బాలీవుడ్ కు దొరికిన డైమండ్
బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ హామీ చాపకింద నీరులా తెలంగాణ మొత్తం వ్యాపించిందన్నారు లక్ష్మణ్. ధరణి లేకపోతే రైతు బంధు ఎట్లా ఇస్తారని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, కిసాన్ సమాన్ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో వేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ధరణి లేకపోతే డబ్బులు రావడం లేదా? అని ఆయన అన్నారు. బీజేపీ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, బీజేపీ గ్రాఫ్ పెరిగింది.. అగ్ర నేతల పర్యటనతో మరింత పెరుగుతుందన్నారు. పేదవాడు ప్రధాని అయితే కాంగ్రెస్, BRS తట్టుకోలేక పోతున్నాయని, తెలంగాణను అడ్డుపెట్టుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, కేసీఅర్ ను అడ్డం పెట్టుకొని కేటిఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. మోడీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని లక్ష్మణ్ హితవు పలికారు.
APSRTC: డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలు.. ప్రజల ఆదరణతోనే ఆదాయం