Washing Machine: ఈ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది చాలా కామన్‌గా ఉండే వస్తువుగా మారిపోయింది. అయితే ఇటీవల వెలుగు చూసిన కొన్ని ప్రమాదాల్లో వాషింగ్ మెషీన్ ముఖ్య కారణంగా నిలిచింది. అవును మీ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్ నుంచి ఏమైనా శబ్దాలు వస్తు్న్నాయా.. ఎందుకంటే ఉన్నట్లు ఉండి రన్నింగ్‌లో ఉన్న వాషింగ్ మెషీన్‌లు పేలిపోయిన సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. ఈ స్టోరీలో అసలు వాషింగ్ మెషీన్ ఎందుకు పేలిపోతుందో వివరంగా తెలుసుకుందాం.
READ ALSO: Mobile phone: మొబైల్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య..
ఈ సందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ.. మీ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్ స్పిన్నింగ్( అధిక స్పీడ్) తిరగడం కారణంగా కూడా ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మెషీన్లోని ఫిల్టర్, బ్యాటరీ పేలే గుణం కలిగి ఉంటాయని వెల్లడించారు. కొన్సి సార్లు వాషింగ్ మెషీన్లో ఓవర్ లోడ్, షార్ట్ సర్క్యూట్ వల్ల రన్నింగ్‌లో ఉండగానే పేలిపోయే ఛాన్స్ ఉంటుందంటుని తెలిపారు. అలాగే వాషింగ్ మెషీన్ డ్రమ్బేరింగ్స్ దెబ్బతిన్నప్పుడు, మెషీన్రన్నింగ్లో ఉన్నప్పుడు గోడకు, ఇతర వస్తువులకు తగిలినప్పుడు కూడా పేలే అవకాశం ఉందని చెబుతున్నారు.
READ ALSO: Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ మార్చి 5నే రావడానికి అసలు కారణం ఇదేనా!