ఒకప్పుడు సినిమాలను మెయిన్ మీడియా బాగా పుష్ చేసేది. సినిమాల మీద మంచి పాజిటివ్ అభిప్రాయం కలిగేలానే ప్రమోషన్స్ ఉండేవి. కానీ సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు పరిస్థితి మారింది. నిర్మాతలు తమకు పుష్ ఇచ్చి సపోర్ట్ చేసిన మీడియా మీద కృతజ్ఞత లేకుండా సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తున్నారు. అందరూ అని అనలేం, కానీ కొంతమంది నిర్మాతలు తమ సినిమా బాగున్నా, బాగోకపోయినా, పెయిడ్ క్యాంపెయిన్లు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన జర్నలిస్టుల ద్వారా “ఆహా, ఓహో, అద్భుతం” అంటూ ముందుగానే హైప్ క్రియేట్ చేస్తున్నారు.
Also Read:Trivikram- Jr NTR: త్రివిక్రమ్-ఎన్టీఆర్.. ఎన్నేళ్లకు?
ఈ మధ్యకాలంలో సైలెంట్‌గా అనౌన్స్ చేసి రిలీజ్ చేసిన ఒక సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. “ఇంకేదో జరిగిపోతోంది, తెలుగు సినీ చరిత్రలో అద్భుతం రాబోతోంది” అన్నట్లు దాన్ని ఒక రేంజ్‌లో హైప్ చేశారు. ఇది బిజినెస్ కోసమా లేక తమ ప్రభావం కోసమా తెలియదు, కానీ ఒక టీజర్‌తోనే ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్‌ను కలిగించడం కామెడీగానే ఉంది. ఇక ఇప్పుడు కుబేర సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాత ఏషియన్ సునీల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. “ఖలేజాకి మంచి కలెక్షన్లు వచ్చాయి కదా? రిలీజ్‌లు అంటే అవును, వీళ్లు మళ్లీ రేటింగ్స్ ఇవ్వలేదు కాబట్టి వచ్చాయి” అంటూ కామెంట్ చేశాడు.
Also Read:OTT Movie : ఓటీటీలోకి ‘DD నెక్స్ట్ లెవల్’.. ఎక్కడ చూడాలంటే?
నిజానికి, సినిమా బాగుంటే దాన్ని ఆపడం మీడియా వల్ల కాదు, సినిమా బాగోకపోతే దాన్ని లేపడం కూడా మీడియా వల్ల కాదు. ఒకవేళ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్ నడుస్తోందనే విషయం ప్రేక్షకులకు అర్థమైతే, ఆ సినిమాని పట్టించుకోవడం కూడా మానేస్తారు. కాబట్టి, సినిమాని లేపడమైనా, పడేయడమైనా మీడియా వల్ల కాదు. కొంత ప్రభావం చూపే అవకాశం ఉందేమో, కానీ అది పూర్తిగా అవునని లేదా కాదని చెప్పలేని పరిస్థితి.