Chadalavada Srinivasa Rao: అందుకే.. ప్రేక్షకుడు దొంగ దారిలో సినిమా చూస్తున్నాడు!
- తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు
- రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్‌మీట్
- నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి రవి హైదరాబాద్ రాగా.. తెలంగాణ పోలీసులు అతడిని పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో టాలీవుడ్ సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘సినిమా పైరసీ అనేది క్యూబ్, వీఎఫ్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్ నుంచి బయటకు వెళ్తుంది. నిర్మాతలు వాటి మీద కచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తీసామని టికెట్ రేటు పెంచితే ఎలా?. టికెట్ రేటు ఎక్కువ ఉండడం వల్లనే ప్రేక్షకులు దొంగ దారిలో సినిమా చూస్తున్నారు. క్వాలిటీ సినిమా తీయాలి కానీ.. బడ్జెట్ ఎక్కువ సినిమాలు కాదు. భారీ బడ్జెట్ సినిమాల్లో రెమ్యునరేషన్ ఒకరికి ఇద్దరికీ మాత్రమే ఎక్కువ ఇస్తున్నారు. దాని ప్రభావం వల్ల టికెట్ రేటు ఎక్కువ అవుతుంది. పెద్ద బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి 10 లోపు వస్తుంటాయి. వాటి వల్ల చిన్న సినిమాలు ఎక్కువ నష్టపోతున్నాయి’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.
Also Read
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
- Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
Also Read: Kalyan C: ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి.. నిర్మాత సి కళ్యాణ్ ఫైర్!
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ… ‘సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం బిగ్ చాలెంజ్‌గా తీసుకుంది. పైరసీ చేసే వారిని పట్టుకోవడం జరిగింది. అది సినీ పరిశ్రమకు వరం. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చే విధంగా ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు’ అన్నారు.
తాజావార్తలు
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!