సినీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్ కో ఆర్డినేషన్ మెంబర్స్ తో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల చర్చలు జరపబోతున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి సూచనల తో చర్చలు జరుపనున్నారు. చర్చల అనంతరం సమ్మె పై ప్రకటన చేయనున్నారు ఇరు వర్గాలు. ఈరోజు జరిగే చర్చల్లో అంతిమంగా అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్.
Also Read : Janhvikapoor : పరమ్ సుందరి.. జాన్వీ పాపకి హిట్ ఇస్తుందా
సోమవారం తెలంగాణ ఎఫ్ డి సి ఛైర్మెన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు , ఫెడరేషన్ నాయకులతో విడి విడి గా చర్చించిన మంత్రి కోమటి రెడ్డి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం అని ఫెడరేషన్ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు విభాగాలకు వేతనాలు పెంచకపోవడం తో ఫెడరేషన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు యూనియన్ లకు తప్పించి మిగతా యూనియన్ సభ్యులకు రూ. 2000 వేలు లోపు కార్మికులకు ఓవరాల్ 25 % వేతనాలు పెంచిన నిర్మాతలు. రూ. 2000 పైన రోజు వారి వేతనాలు ఉన్న డాన్సర్స్ ఫైటర్స్ టెక్నీషియన్స్ యూనియన్ వాళ్లకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు. ఆ మూడు యూనియన్స్ కు వేతనాలు పెంచితేనే సమ్మె విరమణ చేస్తామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. నిర్మాతలు పెట్టిన మిగతా కండిషన్ లు దశల వారీగా అమలు చేస్తామన్నారు ఫెడరేషన్ నాయకులు. ఈరోజు జరిగే ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకుల చర్చలపై అందరు ఎదురుచూస్తున్నారు.