Chintamaneni Prabhakar: పోలీసుల తీరుపట్ల టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 3న తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు రక్తదాన శిబిరం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు చింతమనేని ప్రభాకర్ వెళ్లగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తన చొక్కా చింపివేశారని ప్రెస్‌మీట్‌లోనే చింతమనేని ప్రభాకర్ తన చొక్కా విప్పి చూపించారు. అత్యుత్సాహంతో తన చొక్కా చింపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చింతమనేని హెచ్చరించారు. ఇప్పటికే తనపై 31…
Andhra Pradesh: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి క్షమించాలంటూ వేడుకున్నాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశానంటూ వైసీపీ కార్యకర్త ముచ్చుమర్రి రామాంజనేయులు అభిప్రాయపడ్డాడు. Read Also: Twitter Data Leak:…
Chandra Babu: కడప జిల్లా కమలాపురంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ తరహాలో తాను ఒక రాష్ట్రం ముఖ్యమని.. అధికారం ముఖ్యమని చెప్పను అని.. తనకు తెలుగు జాతి ముఖ్యమని.. తెలుగు ప్రజలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని.. వాళ్లకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. తెలుగు జాతి…
Telugu Desam Party: తెలంగాణలో డీలా పడ్డ టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కాస్త బలం ఉన్న ఖమ్మం వేదికగా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 21న ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ గ్రౌండ్‌లో టీడీపీ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు.…
Guntur District: యుగపురుషుడు నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని పాలపర్రు గ్రామంలో ఆవిషష్కరించాడు తారకరత్న. యన్టీఆర్ విగ్రహా విష్కరణ అనంతరం తారకరత్న మాట్లాడుతూ ‘1982లో కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతి. రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు రామన్నగా నిలిచిన మహానుభావుడు ఎన్టీఆర్. సంకీర్ణ ప్రభుత్వాలు మన…
VijayasaiReddy: ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్, కన్నడ హీరో యష్ భేటీ కావడంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. పప్పు పాదయాత్రకు జనాలు పోటెత్తాలంటే పాన్ ఇండియా మూవీ హీరోలను రప్పించాలంటూ చురకలు అంటించారు. ‘ఉ(య)ష్! వాళ్లు రాకపోతే? హోటళ్లు, షూటింగ్ స్పాట్లకు ఏ దిగ్గజ దర్శకుడి రిఫరెన్సుతోనో లేకేషే వెళ్లి కలవాలి. ఛార్టర్డ్ ఫ్లైట్లు, కోట్లల్లో పారితోషికం అరేంజ్ చేయాలి. ఇదీ…
Kodali Nani: ఏపీలో పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాలు కాక రేపుతున్నాయి. మాచర్లలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ వాళ్లే దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాజకీయాల్లో గొడవలు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి గొడవలు మొదటిసారి కాదు.. చివరిసారి కూడా కాదన్నారు. బహిరంగ సభల్లో 75 ఏళ్ల చంద్రబాబు ప్రతిరోజూ వైసీపీ నేతలను బట్టలూడదీసి కొడతానని అంటున్నారని..…
ChandraBabu: గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. అయితే ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. మాచర్ల పరిస్థితులపై గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు…
Clashes in Macherla: పల్నాడు జిల్లా మాచర్ల అగ్నిగుండంలా మండిపోతోంది. వైసీపీ కార్యకర్తల విధ్వంసంతో మాచర్లలో హింస పేట్రేగింది. అధికార పార్టీ కార్యకర్తలను కంట్రోల్‌లో పెట్టాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో పాటు టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్…
ISB @20 Years: నేడు దక్షిణ భారత దేశానికే హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ తలమానికంగా నిలుస్తోంది. గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) ప్రస్తుతం ద్విదశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్లో ఐఎస్బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. 1999లో ఐఎస్బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో నాటి ప్రధాన మంత్రి వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడీ బిజినెస్ స్కూల్కు 20 ఏళ్లు పూర్తయ్యాయి.…