జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా.. వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలకగా.. అనంతరం ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి…
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చాలా కాలం నుంచి పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం బద్ధ శత్రువులుగా ఉన్నాయి. గతంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండగా… పరిటాల కుటుంబం మాత్రం తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ వస్తోంది. అయితే 2014 తర్వాత జేసీ కుటుంబం కూడా టీడీపీలో చేరడంతో ఈ రెండు వర్గాల మధ్య క్రమంగా దూరం తగ్గుతూ వస్తోందని టాక్ నడిచింది. Read Also: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు…
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తానని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్,…
ఏపీలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ, స్కూల్ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా… ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.…
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బద్వేల్ ఉప ఎన్నికలో చారిత్రక విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఎన్నిక తమ బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల వ్యాఖ్యానించారు. ఓడితే సమీక్షించుకోవడానికి, గెలిస్తే మరింత బాధ్యతగా పనిచేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని సజ్జల తెలిపారు. Read Also: సీఎం జగన్ రికార్డును బద్దలు కొట్టిన మహిళ మరోవైపు ప్రధాన…
ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సోమవారం సాయంత్రం లోక్‌సభ టీడీపీ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వైఎస్ఆర్‌సీపీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ వైసీపీ దాడులు చేయిస్తోందని, బూతులు తిట్టిస్తోందని ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. Read Also: ఏపీలో…
బద్వేలులో ఉప ఎన్నిక సమరం ముగిసింది. ఈనెల 2న ఫలితం తేలనుంది. అయితే ఉప ఎన్నికలో గెలుపు వైసీపీకే అనుకూలంగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తున్నా.. బరిలో నిలిచిన బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది కీలకంగా మారింది. ఎందుకంటే బద్వేల్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అయితే తెరచాటున బీజేపీకి టీడీపీ సాయం చేసిందని జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. బద్వేల్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. పలు చోట్ల…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు సానుభూతి రాజకీయాలకు తెరలేపారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘అన్ని ఎన్నికల్లో ఓడి తలబొప్పి కట్టడంతో సానుభూతి కోసం కుప్పంలో వీధి నాటకాలకు తెరతీశాడు చంద్రబాబు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులు చేయించాడు. తనపైనే ఎవరో దాడి చేస్తున్నట్లు నిద్దట్లో కలవరిస్తూ ఆ ఫస్ట్రేషన్ జనంపై చూపిస్తున్నాడు. ఏంటి బాబు ఈ డ్రామాలు? ఓట్ల…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీలో పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎద్దేవా చేయడం సీఎంగా మీకు అవమానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రులకు మాత్రం ఆ వ్యాఖ్యలు తీరని అవమాకరంగా భావిస్తున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ సర్కారు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిందని, ప్రభుత్వం…