చంద్రబాబు, పవన్‌లపై తిట్ల వర్షం కురిపించిన మంత్రి కొడాలి నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ ఈరోజు టీడీపీ నేతలు ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు తీరుపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సర్‌ఛార్జీ విధించినట్లు కొడాలి నాని గుర్తుచేశారు. ఎక్కడైనా పెట్రోల్ ధరలను ముఖ్యమంత్రి తగ్గిస్తాడా అని ప్రశ్నించారు. టీడీపీకి ఎన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదన్నారు. చంద్రబాబు లుచ్చా రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీని ఓటర్లు పెట్రోల్ పోసి తగులపెట్టారని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
Read Also: విమాన ప్రయాణికులకు శుభవార్త
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
మరోవైపు స్టీల్‌ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వానికి వారం రోజులు డెడ్‌లైన్ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లడానికి జగన్‌కు పవన్ డెడ్‌లైన్ పెట్టాడని.. వారం కాదు ఏడేళ్లు డెడ్‌లైన్ పెట్టినా పవన్‌ను జగన్ ఢిల్లీకి తీసుకువెళ్లరని స్పష్టం చేశారు. కావాలంటే పవన్‌కు చెందిన లుచ్చా పార్టీలోని నేతలను పంపిస్తే తానే టిక్కెట్లు బుక్ చేయించి ఢిల్లీకి పంపిస్తానని.. దాని కోసం డెడ్‌లైన్లు పెట్టాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని… తనతో పొత్తు పెట్టుకున్న మోదీని అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా ఢిల్లీలో అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు కాబట్టే జగన్‌ను తీసుకువెళ్లాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకుని అఖిలపక్షం పేరుతో ఢిల్లీకి తీసుకువెళ్లాలంటూ సిగ్గులేకుండా అడుగుతున్నారని కొడాలి నాని ఆరోపించారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!