అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏపీ అసెంబ్లీని భూతుపురాణంగా మార్చేశారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. కేటుగాళ్లందరూ అసెంబ్లీలో కూర్చున్నారని.. వైసీపీ నేతలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. సీఎం జగన్ తల్లి, చెల్లి కూడా ఓ మహిళే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. మాజీ సీఎం భార్యపై ఇష్టానుసారంగా మాట్లాడితే పోలీసులు చర్యలు తీసుకోరా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. Read Also: చంద్రబాబు గ్లిజరిన్…
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఓ చర్చలో భాగంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలోని పలుచోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ మేరకు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు…
చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని అర్థమైందని… అందుకే భార్య పేరుతో ప్రజల్లో సింపతీ పొందాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని తాము ఏమీ అనలేదని.. ఒకవేళ అని ఉంటే రికార్డులు చూపించాలని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజకీయంగా తెలివిగల వాడు కాబట్టే.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలిసి చంద్రబాబు భార్య పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనేక కుటుంబాలను ఏడ్పించిన వ్యక్తి చంద్రబాబు అని……
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ‘మమ్మల్ని రాజీనామా చేసి రమ్మంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏం పీకారు. దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవండి చూద్దాం. 19 మందిలో మీకు సింగిల్ డిజిట్ వస్తే మేం రాజీనామా చేస్తాం’…
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఆరునెలల విరామం తర్వాత అసెంబ్లీ జరగనుండటంతో పలు కీలక ఆర్డినెన్సులను ఆమోదించాలని సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. Read Also: అసెంబ్లీ సమావేశాల్లో…
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి పరాభవం మాములు విషయంగా మారిపోయింది. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు మాములే. అయితే ఓ ఎన్నికలో పరాభవం ఎదురైతే.. తరువాత జరిగే ఎన్నికల్లో పుంజుకోవాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థిపై పోటీకి సై అంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఓటములను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికల…
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కుప్పంలో గెలిచామని సీఎం, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని… అది కూడా ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు, శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన మహిళలను…
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను టీడీపీ నేతలు పూర్తిగా తమ పాదయాత్రగా మార్చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆరోపించారు. రైతుల పాదయాత్రను తమకు అనుకూలంగా మార్చుకుని పసుపుమయంగా చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలు పాల్గొనడమే దీనికి నిదర్శనమన్నారు. పోలీసులు రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదని.. కేవలం టీడీపీ శ్రేణులను మాత్రమే అడ్డుకున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. Read Also: శ్రీశైలం వెళ్లే పర్యాటకులకు గమనిక.. బోట్ సర్వీస్…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కుప్పంలో వాతావరణం పొలిటికల్‌గా హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పాగా వేయాలని అధికార పార్టీ వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. కుప్పంలో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదని ఇప్పటికే నారా లోకేష్ విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు లోకేష్‌కు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా…
దేశవ్యాప్తంగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక విరాళాలు సేకరించిన ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అగ్రస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీకి విరాళాల రూపంలో రూ.89 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రెండో స్థానంలో ఉంది. టీడీపీకి విరాళాల రూపంలో రూ.81 కోట్లు వచ్చాయి. అటు ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి విరాళాల రూపంలో రూ.74 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ తెలిపింది. దేశవ్యాప్తంగా…