టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సహా పలువురు ప్రముఖులు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మరోవైపు భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దంపతులు గురువారం నాడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. Read Also: చంద్రబాబుకు నమస్కారం చేసిన వైసీపీ…
గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రౌడీల తరహాలో రెచ్చిపోయారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త సైదాను అత్యంత దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్‌ను మించిపోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
కడప జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరఫున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఇస్తామని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమని ఆరోపించారు. Read Also: విధ్వంసానికి.. సీఎం జగన్ బ్రాండ్…
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి మద్దతు తెలపగా… తాజాగా హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కూడా టీడీపీ అధినేతకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరమని సోనూసూద్ వ్యాఖ్యానించాడు. దేవాలయం లాంటి సభలో వైసీపీ నేతల వైఖరి సరికాదని సోనూసూద్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్…
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలి వివాహం ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్, కేసీఆర్ ఇద్దరూ ముచ్చటించుకున్నారు. అయితే ఏపీలో ఓ పక్క వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుకావడంపై టీడీపీ నేత లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుఉ కావడమేంటని లోకేష్…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 23 (మంగళవారం) నుంచి ఏపీలోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. బుధవారం నెల్లూరులో ఆయన పర్యటిస్తారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై శనివారం నాడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. Read Also: వరద బాధిత కుటుంబాలకు జగన్ శుభవార్త రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారని వస్తున్న ఆరోపణలను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర అసహనంతో ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే సీఎం జగన్ ఒప్పుకోరని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. Read Also: చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి మహిళలపై తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని…
శుక్రవారం నాటి అసెంబ్లీ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలని నందమూరి సుహాసిని హితవు పలికారు. Read Also: బాబాయ్ గొడ్డలిపై చర్చిద్దాం అని ఎత్తింది చంద్రబాబు : పేర్ని నాని ‘భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.…
ఏపీ అసెంబ్లీ శుక్రవారం రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ముఖ్యంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చంద్రబాబుపై మాటల యుద్ధం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలపై చర్చ నడుస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read Also: వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన పురంధేశ్వరి ‘లోకేష్ ఎలా…
అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ ఏపీకి సీఎం అయ్యింది చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడానికే అని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఒకపక్క రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రజలు కొట్టుకుపోతుంటే మంత్రులకు ఏ మాత్రం పట్టడం లేదని ఆరోపించారు. చంద్రబాబు కంటతడి వైసీపీ నేతలకు శాపమని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు విషయాలు బయటకు వస్తాయనే ఇలా తిట్టిస్తున్నారని.. ఇంకోసారి తమ నాయకుడి గురించి మాట్లాడితే…