జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న రెండు పథకాలకు కేంద్ర నుంచి గుర్తింపు లభించింది. టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందించడంలో ముందున్న వైద్య ఆరోగ్యశాఖకు జాతీయస్థాయిలో తొలి ర్యాంకు లభించింది. ప్రతిరోజూ టెలీ కన్సల్టేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 1.3 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో ఏపీకి సంబంధించి సుమారు 70వేల మందికి 27 హబ్స్‌లలో వైద్యుల నుంచి టెలీ కన్సల్టేషన్ ద్వారా…