* హైదరాబాద్: నేడు మొయినాబాద్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు, కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
* ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఏడు బిల్లులపై శాసనసభలో చర్చ, ఆమోదం, కేంద్ర విద్యుత్ బిల్లు, పరిణామాలపై స్వల్ప కాలిక చర్చ
* గుంటూరు: నేడు అమరావతి నుండి అరసవల్లి వరకు రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం… నేడు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కృష్ణయ్య పాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు మీదుగా మంగళగిరి వరకు సాగనున్న పాదయాత్ర.
* తిరుపతి: నేటి నుంచి చంద్రగిరిలో పంచాయతీ అభివృద్ధి సదస్సులు…
* నేడు గుంటూరు కార్పొరేషన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీల స్వీకరణ కోసం స్పందన కార్యక్రమం.
* చిత్తూరు: నేడు కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పర్యటన
* శ్రీకాకుళం: నేడు మెట్టెక్కివలసలో నాడు నేడు పనులకు శంకుస్థాపన చెయనున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.
* కృష్ణా జిల్లా: నేడు ఉదయం 10 గంటలకు మచిలీపట్నంలోని మెడికల్ కాలేజ్ నిర్మాణా పనులను పరిశీలించనున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్
* కృష్ణా జిల్లా: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నిమ్మకూరు భారత్ ఎలక్ట్రానిక్స్ నిర్మాణ పనులను పరిశీలించనున్న భారతీ ప్రవీణ్ పవార్
* విశాఖ జిల్లాలో మంత్రి విడదల రజనీ రెండో రోజు పర్యటన.. ఆనందపురం మండలం గిడజాల, దంగుడుబిల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు శంకుస్థాపన. మధ్యాహ్నం జీవీఎంసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న మంత్రి
* నెల్లూరు : నేడు కందుకూరు మున్సిపాలిటీలో సమస్యలపై డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమం..
* బాపట్ల : చీరాల పాపరాజు తోటలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 28 దంపతులచే ప్రత్యేక పూజలు, హోమాలు..
* నేటి నుంచి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర, మేడ్చల్ కుత్బుల్లాపూర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు పాదయాత్ర, 10 రోజులు 115 కిలోమీటర్లు సాగనున్న బండి సంజయ్ పాదయాత్ర