ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. నేడు నాందేడ్ కు సీఎం కేసీఆర్ బయలు దేరనున్నారు. అక్కడ భారీ భహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కేసీఆర్ సమక్షంలో మరాఠా నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
Off The Record: అసమ్మతి.. అసంతృప్తి…! ప్రస్తుతం తెలంగాణలో ఒక మున్సిపాలిటీ నుంచి మరో మున్సిపాలిటీకి పాకుతున్న రాజకీయ అలజడి. పదవులపై ఆశ కలుగుతుందో లేక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న ఆగ్రహమో కానీ.. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి నుంచి నగర పంచాయితీల వరకు ఒకే సీన్ కనిపిస్తోంది. మొదట్లో రాజధానికి ఆనుకుని ఉన్న కొన్ని పురపాలికల్లో బీజంపడ్డ అసమ్మతి ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ అధికాపార్టీలో కంపనాలు తీసుకొస్తోంది. అధిష్ఠానం వారిస్తున్నా.. ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నా స్థానిక సంస్థల్లోని ప్రజాప్రతినిధులు…
Telangana Cabinet Meeting: బడ్జెట్‌ను ఆమోదించేందుకు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగనుంది. బడ్జెట్ పై చర్చించిన తర్వాత.. ఆమోదించనుంది. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో.. బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఈ భేటీలో మంత్రులకు…
సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర నేతలు భేటీ.. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్ల పథకాలపై చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను సీఎంను అడిగి నేతలు తెలుసుకున్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని మహారాష్ట్ర…
AIMIM Big Plan: ఎంఐఎం అంటే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పార్టీ.. పాత బస్తీకే పరిమితమైన పార్టీ.. కొత్త నగరంలో ఏ మాత్రం ప్రభావితం చూపించలేని పార్టీ.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగిన స్థాయిలో దాని ప్రభావం ఉండదని చెబుతారు.. కానీ, ఇది నిన్నటి వరకే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.. రాష్ట్రంలో ఏకంగా 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది.. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్…
టాలీవుడ్ యంగ్ హీరో అరెస్ట్.. సినీ నటుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన నవీన్ రెడ్డి.. కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అభియోగాలు మోపారు.. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై భాదితులు, ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ మోసం…
తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు గాను మరో 313 పోస్టులు మంజూరయ్యాయి.