టాలీవుడ్ యంగ్ హీరో అరెస్ట్..
సినీ నటుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన నవీన్ రెడ్డి.. కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అభియోగాలు మోపారు.. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై భాదితులు, ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ మోసం వెలుగు చూసింది.. నవీన్ రెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.. దీంతో.. తనడిపై సెక్షన్లు 420, 465, 468, 471 r/w, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. విచారణ తర్వాత నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు.. అయితే, ఎన్ స్క్వేర్ కంపెనీ డైరెక్టర్లను మోసం చేసిన డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు చేసినట్టు.. ‘నో బడీ’ అనే పేరుతో హీరోగా సినిమా తీసినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు నవీన్‌రెడ్డి స్వస్థలం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెంగా చెబుతున్నారు.. నవీన్ రెడ్డిపై గతంలో బైక్ దొంగతనం కేసులు సైతం ఉన్నాయని చెబుతున్నారు.. నవీన్‌రెడ్డి కేసులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఖమ్మంలో వందేభారత్ ట్రైన్‌పై రాళ్లదాడి
ఖమ్మం జిల్లాలో విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై శనివారం రాళ్ల దాడి జరిగింది. సంఘటన కారణంగా, ఎమర్జెన్సీ విండోను మార్చవలసి వచ్చింది, దీని వలన చేరుకోవడంలో మూడు గంటలు ఆలస్యమైంది. విశాఖపట్నం నుంచి ఉదయం 5:54 గంటలకు బయలుదేరిన రైలు మధ్యాహ్నం 2:25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంది. నివేదికల ప్రకారం, సిసిటివి ఫోటో ద్వారా నిందితులను గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. జనవరి 11న, మెయింటెనెన్స్ మరియు ట్రయల్ రన్ కోసం రైలు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. కోచ్ అద్దాలు పగిలిపోయాయి. జనవరి 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఇది భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన ఎనిమిదవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తెలుగు మాట్లాడే రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ దాదాపు 700 కి.మీ. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమండ్రి మరియు విజయవాడ స్టేషన్‌లలో మరియు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మరియు సికింద్రాబాద్ స్టేషన్‌లలో ఆగుతుంది.
ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టురట్టు.. ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్ అరెస్ట్
ఎన్నో కలలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న అమ్మాయిల జీవితాల్ని కొందరు దుండగులు బుగ్గిపాలు చేస్తున్నారు. అవకాశాల పేరిట ఆశచూపి.. వారిని చీకట్లో తోసేస్తున్నారు. వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. పడకసుఖం అందిస్తే పెద్ద పెద్ద ఆఫర్లు వస్తాయని చెప్తూ.. ఆ అమ్మాయిల చేత పాడుపని చేయిస్తున్నారు. ఇలాంటి పాడు పనే చేయిస్తూ.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తాజాగా పట్టుబడ్డాడు. సినిమా అవకాశాల పేరుతో ఉత్తరాతి నుంచి అమ్మాయిల్ని పిలిపించి.. వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. చివరికి అతగాడు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అతని పేరు సురేష్ బోయిన. ఓ ప్రముఖ దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. 2017 నుంచి ఆ దర్శకుడి వద్ద పని చేస్తున్న సురేశ్.. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. ముంబై, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఇక్కడికి పిలిపించి.. వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అమ్మాయిల ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి.. అతడు ఈ పాడు పని చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని కొందరు ప్రముఖులకు సైతం ఇతడు యువతుల్ని సరఫరా చేశాడు. పెద్దవారి కోరికలు తీరిస్తే.. భారీ అవకాశాలు వస్తాయని, దాంతో కెరీర్ మలుపు తిరుగుతుందని మాయమాటలు చెప్తూ వచ్చాడు. గోవా, బెంగళూరులో కూడా వ్యభిచారం దందాను నడిపించాడు. సురేష్ బోయిన చేస్తున్న ఈ చీకటి వ్యాపారం గురించి తెలుసుకుని.. పోలీసులు అతడ్ని అడ్డంగా పట్టుకున్నారు. ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి, సాక్ష్యాలతో పాటు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటు మేకల అఖిల్ కుమార్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది. వీరి చెర నుంచి ఆ యువతుల్ని తప్పించారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? పెద్దతలకాయల హస్తం ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇండియాకు వ్యతిరేకంగా పందెం కాయొద్దు.. గ్లోబల్ మీడియాకు వార్నింగ్..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా గ్రూప్ కంపెనీ చీఫ్ ఆనంద్ మహీంద్రా. సమకాలిన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. నెటిజన్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా అదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై స్పందించారు. భారతదేశంపై ఎప్పుడు పందెం కాయొద్దు అని పాశ్చాత్య మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల హిండెన్ బర్గ్ విడుదల చేసిన రిపోర్టులతో అదానీ షేర్లు పడిపోతున్నాయి. అయితే ఇది కావాలని కొన్ని భారత వ్యతిరేక శక్తులు ఇలా చేస్తున్నాయనే ఆరోపణలు చేస్తున్నాయి. భారత ఎదుగుదలను ఓర్వలేని దేశాలు, బీజేపీ వ్యతిరేక శక్తులు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయని బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ తన ఆర్గనైజర్ పత్రికలో విమర్శించింది. వ్యాపారం రంగంలో ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉండాలనే భారత ఆశయాలను దెబ్బతీస్తాయని గ్లోబల్ మీడియా ఊహిస్తోందని.. మేము భూకంపాలను, కరువులను, మాంద్యం, యుద్ధం, తీవ్రవాద దాడులను ఎదుర్కొని జీవించామని.. నేను చెప్పేది ఒక్కటే, భారత్ కు వ్యతిరేకంగా ఎప్పుడు పందెం కాయొద్దు అని ఆయన ట్వీట్ లో గ్లోబల్ మీడియాను హెచ్చరించారు. ప్రపంచంలోనే శరవేగంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది భారత్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలోకి చేరుకుంది. రానున్న కాలంలో మరింత పురోగమించాలని అనుకుంటున్న తరుణంలో అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
స్వదేశంలో టీమిండియా చాలా వీక్..ఆసీస్‌దే విజయం: చాపెల్
ఫిబ్రవరి 9న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో భాగంగా మొదట భారత్-ఆస్ట్రేలియా జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆసీస్ మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్..ఈ సిరీస్ ఆస్ట్రేలియానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. స్వదేశంలో టీమిండియాకు కంగారూ జట్టు రూపంలో కఠిన సవాల్ ఎదురు కానుందని పేర్కొన్నాడు. కీలక ప్లేయర్లు గాయాల కారణంగా దూరం కావడం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న చాపెల్.. దీంతో సొంతగడ్డపై టీమిండియా మరింత బలహీనం కానుందని చెప్పుకొచ్చాడు. “రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడిన కారణంగా సొంతగడ్డపై కూడా టీమిండియా బలహీనంగానే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వాళ్లు విరాట్ కోహ్లీపైనే పూర్తిగా ఆధారపడతారు. భారం మొత్తం అతడిదే. ఈసారి ఆస్ట్రేలియానే సిరీస్ గెలుస్తుంది. భారత్‌లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈసారి అష్టన్ అగర్‌కు ఎక్కువ అవకాశాలు లభిస్తాయనుకుంటున్నా. నాథన్ లియోన్‌తో కలిసి ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాణించగలడు” అని చాపెల్ అన్నాడు. కాగా భారత జట్టుకు 2005-2007 మధ్యకాలంలో చాపెల్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
కళ్యాణ్ రామ్ హీరోయిన్ కి పెరుగుతున్న ఫాలో యింగ్
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్ కనిపించనున్న ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడు, ఒక డిఫరెంట్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అనే నమ్మకం కలిగించడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. ఈ మూవీ కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ కి కూడా మంచి డెబ్యు అయ్యేలా ఉంది. కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించిన అషిక, తెలుగులో నటించిన మొదటి సినిమా ‘అమిగోస్’. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో అషిక ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత కావాలో అంత గ్లామర్ గా కనిపించడంతో అషిక రంగనాథ్ కి తెలుగులో ఫాలోయింగ్ పెరుగుతోంది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో మోడరన్ లుక్ అషిక రంగనాథ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ ని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అషిక పోస్ట్ చేసిన ఫోటోస్ చూసిన ఫాన్స్, కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ్లామర్ లుక్స్ బాగానే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమిగోస్ సినిమా హిట్ అయితే అషిక రంగనాథ్ తెలుగులో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లామర్, డాన్స్ లాంటి విషయాల్లో అషిక ఇప్పటికే ఆకట్టుకుంది కాబట్టి అమిగోస్ సినిమాలో పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తే అషిక కెరీర్ కి మంచి బూస్టింగ్ వచ్చినట్లే అవుతుంది. ఇప్పటికే తెలుగులో కన్నడ నుంచి వచ్చిన అనుష్క శెట్టి లేడీ సూపర్ స్టార్ అయ్యింది. పూజా హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ అవ్వగా, యంగ్ బ్యూటీ శ్రీలీలా తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యే రేసులో ఉంది. బిగ్ స్టార్స్ తో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. మరి ఈ కొత్త హీరోయిన్ అషిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
పార్ట్ 2 ప్రోమో వస్తుంది… రికార్డ్స్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవ్వండి
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చాలు కథ కూడా అవసరం లేదు రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అనే మాట టాలీవుడ్ లో వినిపించేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కర్లేదు ఆయన పేరు చాలు ఎలాంటి రికార్డ్ అయినా బ్రేక్ అవుతుందని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఆయన పేరు కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో కూడా చిన్న విషయానికే ట్రెండ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు ఒటీటీ ఆహాలో బాలయ్య హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో జరుగుతుంది. సీజన్ 2 ఎండ్ కి చేరుకున్న ఈ టాక్ షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చాడు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ గా పేరు తెచ్చుకున్న ఈ సీజన్ క్లోజింగ్ ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ బయటకి వచ్చినా అది నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్ అయితే ఆహా యాప్ నే క్రాష్ అయ్యేలా చేసింది. ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అని ముందే ఊహించి ఆహా వాళ్లు సర్వర్ లు పెంచినా ఉపయోగం లేకుండా పోయింది అంతలా ఎపిసోడ్ ని చూసిన ఫాన్స్ టాక్ షోస్ వ్యూవర్షిప్ లోనే ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతో “Baap of all episodes Part 1 ki pagilipoye records jathara jarigidndhi. Bheemla Nayak power saakshiga, Badrinath pogaru sakshi ga chepthunnam, part 2 tho sensation definition marchadaniki memu ready. Meeru ready na?” అంటూ ఆహా ట్వీట్ చేసింది. పార్ట్ 2 ప్రోమో బయటకి వస్తే అది యుట్యూబ్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యడం గ్యారెంటీ, ఎపిసోడ్ బయటకి వస్తే అది ఆహా వ్యూవర్షిప్ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడం గ్యారెంటీ. సో చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారు.