Today Events February 05, 2023
* ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి.. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి హరీష్ రావు
* నాందేడ్ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ సభ…ఏర్పాట్లు పూర్తి…గులాబీమయం అయిన నాందేడ్….మరాఠీ భాషలో భారీగా బ్యానర్లు, హోర్డింగ్ లు…
*రేపు నాందేడ్ కు సీఎం కేసీఆర్…12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరనున్న కేసీఆర్.
* నేడు కర్నూలులో ఏపీ అమరావతి జేఏసి రాష్ట్ర మహాసభ…హాజరు కానున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, 13 జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు
* శ్రీకాళహస్తిలో మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం….
* ఇవాళ మాఘ పౌర్ణమి.. పుణ్యస్నానాల కోసం సముద్ర, నదీతీర ప్రాంతాలకు చేరిన భక్తులు.. ఆలయాల్లో మాఘ పౌర్ణమి సందడి
*అనకాపల్లి జిల్లా పూడిమడక ,రాంబిల్లి,బంగారమ్మపాలెం సముద్ర తీరాలవద్ద ప్రారంభమైన మాఘపౌర్ణమి సందడి
*నేడు కాకినాడలో సెకండ్ ఇంటర్ స్టేట్ రెయిన్ రియు కరాటే చాంపియన్ షిప్ పోటీలు..రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరు కానున్న 900 మంది క్రీడాకారులు
*మాఘ పౌర్ణమి, ఆదివారం కావడంతో అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ
*రాజమండ్రి- విశాఖ ప్యాసింజర్ రైలు ఈనెల 14 నుండి పునఃప్రారంభం
*గుంటూరు మిర్చి యార్డులో రేపటి నుంచి రైతులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
*గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇవాళ న్యాయ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
*తిరుమల…ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
*తిరుమలలో ఇవాళ నూతన పరకామణి మండపంలో హుండీ లెక్కింపులు ప్రారంభం.. 23 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని నిర్మించిన టీటీడీ..ఇవాళ్టి నుంచి తిరుమలలోనే శ్రీవారి కానుకల లెక్కింపు నిర్వహించనున్న టీటీడీ.
*ఈ నెల 10నఉదయం 9 గంటల 18 నిముషాలకు.. SSLV-D2 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు..ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహాంతో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఇస్రో