తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రేని పార్టీ నేత చెరుకు సుధాకర్ కలిశారు. ఎంపీ కోమటిరెడ్డి పై ఫిర్యాదు చేశారు. తనని చంపుతానంటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ కోరారు.
లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ ఆఫీసు చేరుకున్న కవిత… అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గర అభిమానులకు.. పిడికిలి బిగించి అభివాదం చేశారు. కవితకు మద్దతుగా ఈడీ ఆఫీసు గేట్ వరకూ వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, లాయర్లు సైతం ఉన్నారు. అయితే, వాళ్లను ఆఫీస్…
దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని కేసీఆర్, కవిత ఇంటి ముందు భారీగా పోలీను మోహరించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. ఇదే కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు.
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గుంటలకు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
H3N2 Influenza A Virus: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి మర్చిపోకముందే, మరో కొత్త వైరస్ దేశాన్ని కలవరపెడుతోంది. H3N2 వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఫ్లూ లక్షణాలున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. దేశంలో H3N2 వైరస్ టెన్షన్ పెరుగుతోంది. రెండు, మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తొలిసారిగా రెండు మరణాలు నమోదయ్యాయని కేంద్ర…
రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారు. గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారని ఆయన అన్నారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారని ఆయన మండిపడ్డారు. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. రేపు కవితను అరెస్ట్ చేయొచ్చునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసుకుంటే చేసుకోని అని, అందర్నీ వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం…