తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రేని పార్టీ నేత చెరుకు సుధాకర్ కలిశారు. ఎంపీ కోమటిరెడ్డి పై ఫిర్యాదు చేశారు.
తనని చంపుతానంటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ కోరారు. వెంకట్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు.
Also Read:Thota Chandrasekhar: కవితపై ఈడీ కేసు బీజేపీ కక్ష పూరిత చర్య
కాగా, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ వ్యవహారం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. వారిని చంపేందుకు వంద కార్లలో మనుషులు తిరుగుతున్నారంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తనపై విమర్శలు చేస్తే అభిమానులు ఊరుకోరంటూ చెరుకు సుధాకర్ కుమారుడికి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. టి.కాంగ్రెస్‌లో పెనుదుమారం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన కోమటిరెడ్డిపై చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా చెరుకు సుధాకర్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
Also Read: Japanese Tourist: హోలీ వేడుకల్లో వేధింపులు.. దేశం వీడిన బాధితురాలు
కాగా, ఇప్పటికే ఈ ఆడియోపై ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, భావోద్వేగంతో మాట్లాడాల్సి వచ్చిందంటూ తనకు తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు తాను ఎవరినీ దూషించలేదని చెప్పారు. చెరుకు సుధాకర్‌పై గతంలో పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తే తాను అండగా ఉన్నానని గుర్తుచేశారు.