CM KCR Key Meeting: ఎల్లుండి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. ఈ సమావేశం జరగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో.. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ కార్యకలాపాలతో…
ఏపీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలు ఇవే.. ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటన అన్ని పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది.. టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగియగానే కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి.. ఇవాళ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. మే 5వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన EAPCET నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 15 నుంచి…
సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై తన లేఖలో పేర్కొన్నారు.. అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్థానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా…
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసింది దేశంలో తెలంగాణ మొదటి రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ అన్నారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'మహిళల ఆరోగ్యమే.. ఇంటి శ్రేయస్సు' అని నమ్ముతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
Off The Record: గులాబీ పార్టీ అధినేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర వెళ్లినా.. కర్నాటకలో పర్యటించినా ప్రధాన ఆకర్షణగా నిలిచారు నటుడు ప్రకాష్‌రాజ్. పైగా కేసీఆర్‌తో చాలా చనువుగా కనిపించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పొలిటికల్ వ్యూహరచనల్లోనూ పాల్గొన్నారు ఈ నటుడు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే క్రమంలో సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు కూడా. అయితే BRS జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్న తరుణంలో ప్రకాష్‌రాజ్ యాక్టివ్‌గా…
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే…