దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని కేసీఆర్, కవిత ఇంటి ముందు భారీగా పోలీను మోహరించారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. నిన్ననే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఢిల్లీకి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి ఇప్పటికే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చేరుకున్నారు. ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంభిపుర్ రాజు కూడా కవిత ఇంటికి వచ్చారు. కవిత విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో భద్రతను పెంచారు. అంతేకాకుండా 144 సెక్షను విధించారు. పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
Also Read:Liquor Policy Case: ఆ ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?
పలువురు బీఆర్ఎస్ ఎంపీలు సైతం కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసంలో జాగృతి ప్రతినిధులకు కవిత అల్పాహారం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆడబిడ్డ ఆమెకు మద్దతు తెలిపేందుకు వచ్చామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దేశ విదేశాల్లో తెలంగాణ జాగృతి పేరిట అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవిత కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
కాగా, లిక్కర్ స్కామ్‌లో ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు, సౌత్‌గ్రూప్‌ను ఆపరేట్‌చేసిన వారిలో కవితదే కీలకమని ఈడీ స్పష్టం చేసింది. కవిత, మాగుంట శ్రీనివాస్ సౌత్ గ్రూప్‌కి నాయకత్వం వహించారని ఈడీ పేర్కొంది. 100 కోట్లు హవాలా మార్గాల్లో చెల్లించినట్లు సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో అరెస్ట్ అయిన పిళ్లై.. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీనని ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే, ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని కోర్టు పిటిషన్ వేశాడు. లిక్కర్ కేసులో ఈడీ ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం, సేకరించిన వివరాలు, ఆధారాలతో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.
Also Read:Taneti Vanitha: విపత్తులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం
ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది. మార్చి 9వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో మార్చి 11న విచారణకు హాజరవుతానని కవిత సమాచారం అందించారు. దీంతో ఈరోజు విచారణ తేదీని ఈడీ అధికారులు ఖరారు చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీలో తన నిరాహారదీక్షను చేశారు. ఈ రోజు ఈడీ విచారణకు హాజరువుతున్నారు.