Poster War In Telangana: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది.
నేడు సంగారెడ్డి లోని నూతన బీజేపీ కార్యలయాన్ని ఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ గా సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రారంభించనున్నారు.
చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ పుట్టాడు.. ఆయన్ని దేవుడే రక్షించాలి..! కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముని ఆలయంలో ఇవాళ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అంబటి రాంబాబు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట ప్రత్యేకతను సంతరించుకుందన్న ఆయన.. శ్రీరామ నవమి రోజున కుటుంబ సమేతంగా కోదండ రాముణ్ణి దర్శించు కోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. భద్రాద్రి కన్నా ఎంతో విశిష్టమైన ఆలయం ఒంటిమిట్టగా అభివర్ణించారు.. ఇక, చంద్రబాబు, పవన్‌పై విరుచుకుపడ్డారు…
అర్ధరాత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. రాత్రి 10.45 గంటల సమయంలో అమిత్‌షాతో సమావేశం అయ్యారు సీఎం జగన్.. దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.. రాష్ట్రంలోని సమస్యలు, రాష్ట్రవిభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు…
* నేడు శ్రీరాముని శోభాయాత్ర.. హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. 6 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర * నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం.. హాజరు కానున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హిమాచలప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కళ్యాణంలో పాల్గొననున్న చిన్న జీయర్ స్వామి * విజయనగరం: శ్రీరామ నవమి సందర్భంగా రామతీర్థంలో సీతారాముల కల్యాణం… భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. ప్రభుత్వం తరుఫున స్వామివారికి పట్టు వస్త్రాలు…