ఏప్రిల్ మూడునుంచి టెంత్ పరీక్షలు.. ప్రశాంతంగా రాయండి

వచ్చే నెల మూడో తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. అయితే.. వేసవికాలం తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లడుతూ.. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు నాలుగు లక్షల 94 వేల620 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే.. విద్యార్థులత కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 9:35 నిమిషాల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని ఆమె సూచించారు. ఇప్పటికీ హాల్ టికెట్లు పాఠశాలలకు పంపించడం జరిగింది హాల్ టికెట్ అందరి విద్యార్థులు వెబ్సైట్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆమె తెలిపారు. విద్యార్థులందరూ కూడా పరీక్షకు ప్రశాంతమైన వాతావరణంలో హాజరకండని, పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎం లతో పాటు ఓఆర్ఎస్ పాకెట్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.
2024 ఎన్నికల్లో టీడీపీకి వచ్చేవి నాలుగు సీట్లే

దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్న మొదటి నాయకుడు ఎన్టీఆర్ అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ చనిపోయి 26 ఏళ్ళు పూర్తి అయినా ఇప్పటికీ తెలుగు ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అటువంటి వ్యక్తిని చంద్రబాబు ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది??ఎన్టీఆర్ బతికి ఉండగా ఎందుకు టీడీపీ అధ్యక్ష పదవి నుండి ఆయన్ను చంద్రబాబు సస్పెండ్ చేశాడు. ఎన్టీఆర్ గొప్పతనం గురించి దేశంలో ఉన్న అన్ని పార్టీలు చెబుతాయి. అటువంటి మహానుభావుడి పై చంద్రబాబు ఎందుకు చెప్పులు వేశాడు. ఆయన మరణానికి ఎందుకు కారణం అయ్యావో చంద్రబాబు ఎందుకు చెప్పడు?ఎన్టీఆర్ సిద్ధాంతాల్లో ఒకటి అయినా పాటించావ్…పేదల పార్టీని పెత్తందార్ల పార్టీగా మార్చావ్. చంద్రబాబు ఒక నీచుడు.. దేవుడు లాంటి ఎన్టీ రామారావును ఆత్మక్షోభ పెట్టావ్. ఎన్టీఆర్ స్థాయిలో రాజకీయాల్లో నిలబడిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి.. కాంగ్రెస్ కు ఆయన దిక్సూచి. కూకటి వేళ్ళతో టీడీపీని పెకిలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నాడు. 2023లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. చంద్రబాబు మళ్ళీ దేవుడి స్క్రిప్ట్ ఏది అని మొన్న అడుగుతున్నాడు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొన్నావ్. 2024 ఎన్నికల్లో టీడీపీ నాలుగు సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు కొడాలి నాని.
కార్యకర్తల కష్టమే 41 ఏళ్ళ టీడీపీ ప్రస్థానం

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. కార్యకర్తల కష్టమే 41ఏళ్ళ తెలుగుదేశం పార్టీ అన్నారు బాలయ్య. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలి.పాత తరానికి గుర్తుండేది ఎన్టీఆర్ పాలన, సినిమాలు, మాత్రమే.ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పును ఖండించిన బాలకృష్ణ..ప్రాంతాలు వేరైనా.. తెలుగువారంతా ఒక్కటే అన్నారు. తెలుగు గడ్డలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన ఘనత ఎన్టీఆర్ ది అని కొనియాడారు. రాజకీయాలంటే.. ఎన్టీఆర్ ముందు.. ఎన్టీఆర్ తర్వాత అన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పేదల ఆకలి తీర్చిన అన్న.. బరోసా ఇచ్చిన అమ్మ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే మహిళలకు ధైర్యానిచ్చిన అన్న. ..ఎన్టీఆర్ కు మరణం లేదు.. నిత్యం వెలిగే దీపం ఎన్టీఆర్.. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధినే ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్..పేదలకు కాంక్రీట్ శ్లాబ్ ఇళ్ళ నిర్మాణం ఎన్టీఆర్ హయాంలోనే జరిగిందన్నారు. పేరు పేరున టీడీపీ నేతలకు, కార్యకర్తలకు బాలయ్య బాబు శుభాకాంక్షలు తెలిపారు.
సూర్యుడిపై ఉపరితలంపై భారీ రంధ్రం.. భూమికి ప్రమాదమా..?

సౌరకుటుంబానికి మూలం సూర్యుడు. ఈ గ్రహాలను తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సూర్యుడిపై భారీగా ఏర్పడిన నల్లటి ప్రాంతాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి భారీ బ్లాక్ స్పాట్లను ‘‘కరోనల్ హోల్’’గా పిలుస్తారు. భారీ సూర్యుడి వెలుగుల మధ్య నల్లటి ప్రాంతం ఓ రంధ్రంగా కనిపిస్తుంటుందని అందుకనే వీటిని కరోనాల్ హోల్ గా వ్యవహరిస్తుంటారు. సూర్యుని దక్షిణ ధ్రువానికి సమీపంలో మార్చి 23న నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) కరోనల్ హోల్‌ను కనుగొంది. ఇలాంటి బ్లాక్ స్పాట్ల నుంచి అయస్కాంత తుఫానులు భూమి వైపు దూసుకు వస్తుంటాయి. ఈ బ్లాక్ స్పాట్ల నుంచి సౌర తుఫానులు దూసుకు వస్తుంటాయి. ప్రస్తుతం ఏర్పడిన కరోనల్ హోల్ చాలా పెద్దది. దాదాపు 300,000 నుండి 400,000 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే దాదాపు 20-30 భూమిలతో సమానం. జియోమ్యాగ్నటిక్ తుఫానులను జీ1 నుంచి జీ5 వరకు వర్గీకరించారు. ఇందులో జీ5 అత్యంత శక్తివంతమైనది. ఆల్ట్రావయోలెట్, ఎక్స్ కిరణాలు కలిగి భగభగ మండే సూర్యుడి ఉపరితలంపై బ్లాక్ గా ఉండే ప్రాంతాలను కరోనల్ హెల్స్ అంటారు. చుట్టుపక్కల ఉండే ప్లాస్మా కన్నా ఇది చల్లగా, తక్కువ సాంద్రత కలిగిన ప్రాంతాలు. ఈ కరోనాల్ హోల్స్ సూర్యుడిపై ఎప్పుడైనా, ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే సూర్యుడి ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద చాలా తీవ్రతతో స్థిరంగా ఉంటాయి.
భద్రాచలం వెళ్లినవారు ఏం నేర్చుకోవాలి?

భద్రాచలం వెళ్ళినవారు నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏంటో వివరించారు చాగంటి వారు. భద్రాచలం వెళ్ళి వచ్చాను అంటే… భగవంతుడు మీద అచంచలమయిన విశ్వాసం కలుగుతుంది. ప్రతి భక్తుడు భద్రుడు లాంటివాడు. నా తలమీద శ్రీరాముడు కూర్చున్నాడని అంతా భావించాలి. కారణ జన్ములు కొందరు ఉంటారు. భక్తి అనేది జీవితంలో ప్రారంభం కావాలి. ఎవరి యోగ్యత ఎప్పుడు వస్తుందో తెలీదు. భద్రాచలం వెళితే అనేకం నేర్చుకోవచ్చు. పోకలదమ్మక్కకు రాముడు దర్శనం ఇచ్చాడు. కొండమీద ఉన్న నన్ను వెతికి, పందిరేసి, పూజచేసి, నైవేద్యం పెట్టమని రాముడు కోరాడు. ఆమెకు నమ్మకం ఉంది. కొండమీద వెతికితే రాముడు కనిపించాడు. మనం కూడా వెతకాలి. భద్రాచలం వెళ్ళినవారు నమ్మకం పెంచుకోవాలి.
శ్రీరామనవమికి చేయవలసిన, చేయకూడని పనులేంటి?

సకలగుణాభిరాముడు యావత్ లోకానికి ఆదర్శం. శ్రీరాముడి పెళ్ళంటే ఎంతో వైభవంగా జరుగుతుంది. చైత్ర నవరాత్రుల చివరి రోజైన శ్రీరామ నవమి చైత్ర మాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మిస్తాడు. అందుకే ఆ రోజున శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు రాముని భక్తులు అనేక ఏర్పాట్లు చేస్తుంటారు. రామనవమి హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని పనులను అసలే చేయకూడదు. శ్రీరాముడి కల్యాణం చూస్తే సకల పాపాలు పోతాయని, కుటుంబానికి, ఈసమాజానికి అంతా మంచి జరుగుతుందని అంతా నమ్ముతారు.
శ్రీరామనవమికి ఏం చేయాలంటే.. * చాలామంది రాముడి విగ్రహాన్ని ఊయలో ఉంచి రామ నవమి సంబరాలు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.
* శ్రీరామనవమి నాడు నిద్రలేచిన వెంటనే భగవంతుడికి దండం పెట్టుకోవాలి.
* అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల గత, వర్తమాన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
* రామచరిత మానస్, రామ్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కలిపి పఠించడం మంచిది. రామ కీర్తనలు, భజనలు, స్తోత్రాలు కూడా పఠించాలి.
ప్రెగ్నెంట్ అయ్యా.. అందుకే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా

కోలీవుడ్ నటి పావని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా పావని తెలుగమ్మాయే అయినా.. తమిళ్ లో సెటిల్ అయ్యింది. ఇక్కడ చిన్న చిన్న సినిమాలు, సీరియల్స్ లో నటించి మెప్పించిన పావని, సీరియల్ నటుడు ప్రదీప్ కుమార్ ను ప్రేమించి పెళ్లాడింది. ఎంతో ఆనందంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన పావనికి దేవుడు అంధకారాన్ని మిగిల్చాడు. కొన్ని కారణాల వలన ప్రదీప్ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఇక భర్త మరణంతో కృంగిపోయిన పావని.. తెలుగుకు బైబై చెప్పి .. తమిళ్ లో సెటిల్ అయ్యింది. సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తమిళ్ బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్లి తన భయాలను పోగొట్టుకొని వచ్చింది. ఇక ఆ బిగ్ బాస్ ఇంట్లోనే తన కో కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ అమీర్ ప్రేమలో పడింది. ఈ జంట.. ఈ మధ్య రిలీజ్ అయిన అజిత్ తెగింపు చిత్రంలో ప్రేమ పక్షులుగా కూడా కనిపించారు. బిగ్ బాస్ స్టేజి మీదనే తాము నిజజీవితంలో కూడా జోడిగా ఉండబోతున్నామని ప్రకటించారు. అంతేకాకుండా అమీర్ ను చూస్తే ప్రదీప్ తిరిగి బతికివచ్చినట్లు ఉందని పావని చెప్పుకొచ్చింది.
అలా అయితే ఇండియాలో మేం ఆడం
ఈ ఏడాది ఆసియా కప్ వివాదం కొద్దిరోజుల క్రితమే సద్దుమణిగిందని అనుకుంటున్న ప్రతీసారి ఇది రావణకాష్టంలా రగులుతూనే ఉంది. భద్రతా కారణాల నేపథ్యంలో తాము పాకిస్తాన్ కు రాబోమని.. తటస్థ వేదికలపై అయితేనే ఆసియా కప్ ఆడతామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తేల్చి చెప్పింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చినా పాకిస్తాన్ క్రికెట్ లో మాత్రం ఈ వివాదం కొనసాగుతునే ఉంది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)మాజీ సీఈవో, ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మేనేజర్ ఆఫ్ క్రికెట్ వసీం ఖాన్ సంచలన వ్యాఖ్యలతో మళ్లీ వివాదం చెలరేగుతుంది. ఆసియా కప్ నిర్వహణ వివాదం గురించి చర్చ జరుగుతున్న వేళ పాకిస్తాన్ లోని స్థానికంగా ఉన్న ఓ టీవీ ఛానెల్ తో వసీం ఖాన్ ఈ కామెంట్స్ చేశాడు. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్ కు రాకుండా తటస్థ వేదికలపైనే ఆడతామని చెబుతుంటూ తాము మాత్రం వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్లేది లేదని, తాము ఆడే మ్యాచ్ లకూ న్యూట్రల్ వేదికలు కావాలని డిమాండ్ చేశారు. వసీం ఖాన్ వ్యాఖ్యలకు తోడు ఆసియా కప్ నిర్వహణ వివాదంపై గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ ఆటగాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇండియన్ టీమ్ పాకిస్తాన్ కు వచ్చేందుకు వణుకు పుడుతుందని పాక్ మాజీ ఓపెనర్ ఇమ్రాన్ నజీర్ కామెంట్స్ చేశాడు.