పేపర్ మాల్ ప్రాక్టీస్‌లో తన ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించుకున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. తన సెల్‌ఫోన్‌కు ప్రశాంత్ అనే వ్యక్తి నుంచి ఫోన్లు వచ్చాయా అని పోలీసులు అడిగారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. జూపల్లి , పొంగులేటి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
సుప్రీం కోర్టులో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ చెప్తున్నారని.. ఆయన అబ్బ సొత్తు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వేని ఆధునికీకరిస్తున్నారని.. ఆ తర్వాత అవి అమ్మేస్తారని ఆయన ఆరోపించారు.
ఓ యువతిని ప్రేమించిన యువకుడు.. తమ పెళ్లికి అంగీకరించాలని ఆమె కుటుంబ సభ్యులను కోరగా.. మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా అంటూ యువతి బంధువులు ఓ బడుగు వర్గానికి చెందిన యువకుడిని పట్టపగలే వెంటాడి కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.