Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ విషయంలో ఇప్పుడు తెలంగాణ సర్కార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా మారిపోతోంది.. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్, వ్యతిరేకమా? అనుకూలమా? అనే విషయం స్పష్టం చేయాలి.. బిడ్‌లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అని ఏపీ మంత్రి గుడివాడ్ అమర్నాథ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీలో మీడియాతో…
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది.
Off The Record: కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారట. ఇన్నాళ్ళు అసంతృప్తిగా ఉన్న నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్నందున ఇదే అదను అనుకుంటున్నారట. అసంతృప్త నేతలంతా కలిసి ఏకంగా ఎమ్మెల్యేకు సమాతరంగా కార్యక్రమాలు నిర్వహించడమే ఇప్పుడు కోదాడ బీఆర్ఎస్లో హైలైట్. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, 2014లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు కలసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా…
మత్స్యకారులు అలర్ట్.. 61 రోజుల పాటు చేపల వేట నిషేధం.. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల…
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి ఆహ్వానించిన బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ తరఫున పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలికవసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో…
High Temperature and Heat Waves: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రెండు రాష్ట్రాలను నిప్పుల కుంపటిలా మార్చేశాడు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. ఈ నెల 13 వరకు ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పెరుగతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఇవాళ పెరిగితే.. మరి కొన్ని జిల్లాల్లో రేపట్నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. పలు జిల్లాలకు ప్రత్యేకంగా…
ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల మాస్ కాపీయింగ్ కలకలం సృష్టిస్తోంది.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు జగ్గయ్యపేటలో పరీక్షలకు హాజరవుతున్నారు.. ముడు సెంటర్లలో దాదాపు 700 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. జగ్గయ్యపేట ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఓపెన్ ఇంటర్ పరీక్షల లో జవాబు పత్రాలు అందిస్తామంటూ విద్యార్థికి రూ.15 వేల నుంచి 25 వేల…