KA Paul: సుప్రీం కోర్టులో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసును స్వయంగా కేఏ పాల్ వాదించారు. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని అగ్ని ప్రమాదాలన్నింటిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
Read Also: CPI Narayana: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ సర్కారుకు సీపీఐ మద్దతు
ఈ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ దాఖలైందా? అంటూ సుప్రీం ప్రశ్నలు వేసింది. తన భద్రతను ప్రభుత్వం తొలగించిందని కేఏ పాల్ సుప్రీంలో తెలిపారు. తన జీవితానికి భద్రత ఉందని ఆయన న్యాయస్థానంలో వాదించారు. ఈ సందర్భంగా.. ఒక దానికి మరొక దానికి ముడిపెట్టొద్దన్న సుప్రీం వారించింది. ఈ కేసును సీజేఐ ధర్మాసనం డిస్మిస్ చేసింది.