తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి(BRS) నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని సవాల్ విసిరారు.