Wives M*urder: మృగాలు నయంరా.. వణికించిన హత్యలు.. భార్యలను కిరాతకంగా చంపిన భర్తలు
- మృగాలు నయంరా
- భార్యలను కిరాతకంగా చంపిన భర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో బంధువుల ఇంట్లో భార్యను హత్య చేశాడు భర్త. భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దంపతులు మంజుల, శంకర్ లు బాంబే నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ కి వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు గుర్తించారు. మంజులపై అనుమానంతో నే శంకర్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:MLC Kavitha: ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదు..
Also Read
బోడ శంకర్(40),భార్య పేరు మంజుల(35) వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పాప ఇద్దరు బాబులు. వీరి స్వస్థలం మోత్కూర్ దగ్గర అడ్డగూడూర్ గ్రామం. నాలుగు రోజుల క్రితం మహేశ్ నగర్ కాలనిలో ఉంటున్న అక్క బావ ఇంటికి కుటుంబంతో వచ్చిన శంకర్ అర్థరాత్రి అందరు పడుకున్న సమయంలో కత్తితో విచక్షణారహితంగా భార్యను నరకడంతో ఆమె అరుపుల శబ్దానికి అందరు లేవడంతో శంకర్ అక్కడి నుండి పారిపోయాడు. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
కొమురం భీం జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్ లో భార్యను హత్య చేసిన భర్త గజ్జల తిరుపతి. భార్య స్రవంతి (40) ని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు భర్త. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
-
December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్‌గా డిసెంబర్
-
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!