Public Grievance Redressal: తెలంగాణ ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.. కేంద్రం నుంచే కాకుండా.. కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల నుంచి కూడా అభినందనలు అందుకున్నాయి.. తెలంగాణ ప్రభుత్వ పథకాలు.. ఇప్పుడు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నంబర్ వన్‌గా నిలిచింది తెలంగాణ రాష్ట్రం.. సీపీ గ్రామ్ నివేదిక ప్రకారం.. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. గతంలోనూ అద్భుతమైన పనితీరును చూపించిన తెలంగాణ.. తాజాగా మే నెలలోనూ ఉత్తమ ప్రదర్శనను కనబరిచింది.
తెలంగాణలో మే నెలలోనే 2,524 పిటిషన్లను అత్యల్పంగా ఎనిమిది రోజుల్లోనే పరిష్కరించింది.. అదే లక్షద్వీప్ 12 రోజుల వ్యవధిలో 171 పిటిషన్లను పరిష్కరించి రెండోస్థానం నిలిచింది.. ఇక, అండమాన్ నికోబార్ 442 పిటిషన్లను 20 రోజుల్లో పరిష్కరించి మూడోస్థానంలో ఉంది. ఇక, 15 వేలలోపు పిటిషన్లు ఉన్న రాష్ర్టాలను గ్రూప్-డీ క్యాటగిరీలో చేర్చారు. ఈ క్యాటగిరీ రాష్ర్టాలకు కేటాయించిన ర్యాంకింగ్‌లోనూ తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.. గ్రూ ప్-డీ క్యాటగిరీలో తెలంగాణ 72.49 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలవగా.. ఛత్తీస్‌గఢ్ 55.75 స్కోర్‌తో రెండోస్థానం ఉంది.. ఇదే కేటగిరీలో 8.61 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది.. జాతీయస్థాయిలో సామాన్యుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్‌స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీపీజీఆర్‌ఏఎంఎస్) పేరుతో ఆన్‌లైన్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా.. సామాన్యులెవరైనా ఈ వేదికపై ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. కేంద్రం వాటిని రాష్ర్టాలకు పంపించి, పరిష్కరించాలని కోరుతుంది. ఇందుకోసం రాష్ర్టాలవారీగా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఆఫీసర్స్ ఉంటారు. ఇటీవలే వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జీఆర్‌వోల సమావేశాన్ని నిర్వహించింది.. ఆ నివేదిను బుధవారం విడుదల చేయడంతో.. ఈ విషయం వెలుగు చూసింది.
ఇక, ఆ నివేదికలో పేర్కొన్న కొన్ని కీలకమైన అంశాల విషయానికి వస్తే.. మే నెలలో జాతీయంగా 56,981 ఫిర్యాదులను స్వీకరించగా, పెండింగ్‌లో ఉన్నవి కలుపుకుని 65,983 పిటిషన్లు పరిష్కరించబడ్డాయి.. ఏప్రిల్ నాటికి మొత్తం 2,03,715 కేసులు ఉంటే.. మే నాటికి వీటి సంఖ్య 1,94,713కి తగ్గిపోయాయి పెండింగ్ సమస్యలు.. యూపీ నుంచి అత్యధికంగా పిటిషన్లు రాగా.. 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాం తాల్లో వెయ్యికిపైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. 15 వేలకు పైగా ఫిర్యాదులు నమోదైన రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్ 62.07 స్కోర్‌తో అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాత జార్ఖండ్ 46.14, మధ్యప్రదేశ్ 43.05 స్కోర్ సాధించాయి.