తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్యాన్సిల్ చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో మెయింటనెన్స్ వర్క్స్ దృష్ట్యా పలు ట్రైన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసి మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. వచ్చే సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ఆయనను కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపునా లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయానికి వచ్చారు. గోల్కొండ బోనాలతో మొదలైన బోనాలు సికింద్రాబాద్ లో ఇప్పుడు లాల్ దర్వాజ్ జరుపుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఈరోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
తెలంగాణ ఆర్టీసీలో ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లతో ముందుకు వెళ్తున్న యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను తొలిగించేందుకు శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే క్యాష్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టంను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తిగా చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న బోనాల పండగా ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. నేడు, రేపు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయంలో ఇవాళ( ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 18( మంగళవారం) తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో హైదరబాద్ లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.