తమ డిమాండ్ల సాధనకు గత పది రోజులుగా గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె చేస్తుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి తమ ఉద్యమం తీవ్రం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిన్న (శనివారం) నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని 24 వేల మంది వీఆర్ఏల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరు రెవెన్యూ శాఖలో రూ.10.500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వారి సేవలను అదేశాఖలో క్రమబద్దీకరించడంతో పాటు కొత్త పేస్కేల్ ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణలో పాలిటిక్స్ మంచి రసవత్తరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ పార్టీ కావాలో తెలంగాణ రైతులే తెల్చుకోవాలని ఆయన సూచించారు.
డీఈఓలు, ఆర్జేడీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో అధికారులకు మంత్రి సబితా సలు సూచనలు చేశారు. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54వేల 201 మంది కుక్-కమ్ హెల్పర్లకు లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు.
మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట మండలం బొమ్మరాజుపేట రైతులకు మద్దతుగా శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వెళ్లారు. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1,050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని.. కేసీఆర్ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Telangana: వెనుకబడిన తరగతుల కుల, చేతివృత్తుల వారికి రూ.లక్ష సాయం నేటి నుంచి ప్రారంభం కానుంది. నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష ఇవ్వనున్నారు.