తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆయన మోడీని కలవనున్నారు. అనంతరం ఎల్లుండి( శుక్రవారం) బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల ముందే వైన్ షాపులకు టెండర్లను పిలిచేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమైంది. 2023-25 సంవత్సరానికి గాను.. మరో రెండు మూడు రోజుల్లో వైన్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని.. అదే రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి.
సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు
ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ జి. స్వర్ణలత పిలుపునిచ్చారు. దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారని, మరణించిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శించారు.
గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఫైనల్ కీని తెలంగాణ పబ్లీకి సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. తుది కీని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి.
అందరికీ ఆమోదయోగ్యుడైన బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను నేడు (మంగళవారం) రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జారీ చేశారు. జిల్లాలు, శాఖలు, పోస్టు కేటాయించేందుకు అవసరమైన సమాచారాన్ని పంపాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.