మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అతి తక్కువ పని దినాలు జరిగేది తెలంగాణలోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. వరద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
మెదక్ జిల్లాలో జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తను, తన చెల్లి హత్య చేసేందుకు అక్క సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మెదక్ జిల్లాలోని హత్నూర మండలం షేర్ఖాన్పల్లిలో చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా కూరగాయల ధరల మండిపోతున్నాయి.. అందులో టమోటాల ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. రోజు రోజుకు భగ్గుమంటున్నాయి.. ప్రస్తుతం కిలో కేజీ టమాట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నరు. దీంతో టమాటా కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు.. మరికొన్ని చోట్ల కనీవినని రీతిలో ఏకంగా టమాటా చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువుల జాబితాలో ప్రస్తుతం టమాట కూడా చేరిపోయింది. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆలోచన చేశాడు.. మొన్న…
Farmers Loan: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.
ఈ నెల 20 నుండి తెలంగాణ లో పర్యటించనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు.. 119 నియోజక వర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు.. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు.. వారంరోజులు తెలంగాణలో ఎమ్మెల్యేల టూర్.. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజక వర్గంలో వారం పాటు బస.. పార్టీ పరిస్థితి, స్థానిక పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు..
రేపటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.