Farmers Loan: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. నేటి నుంచే రుణమాఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Loan: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండో వారంలోగా అంటే పదిహేను రోజుల్లో పూర్తిగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీతో పాటు రైతులకు మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఎఫ్‌ఆర్‌బీఎం నిధులు విడుదల కాకపోవడం, తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష వంటి కారణాలతో గత కొన్నేళ్లుగా ఆర్థిక లోటు కారణంగా కొంత జాప్యం జరుగుతోందని కేసీఆర్ అన్నారు.
Read also: Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ముఖ్య సలహాదారు సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్‌ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు. హామీ మేరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగించాం.కరోనా వంటి అనూహ్య అవాంతరాలు, ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్ష కోత, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధులపై కక్ష సాధింపు చర్యల కారణంగా రైతు రుణమాఫీ కార్యక్రమం ఆలస్యమైంది. కొంత కాలం.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుంది.. ప్రభుత్వం ఇప్పటికే చెప్పినట్లు రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను విస్మరించే ప్రసక్తే లేదు.. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా.. ఆదర్శ కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. వ్యవసాయాభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పినట్లే.. రైతులు సాధికారత సాధించి ఆర్థికంగా ఎదిగే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
Pulses Price: టమాటాలు, మసాలా దినుసుల బాటాలోనే పప్పుల ధరలు.. కిలోకు రూ.30 పెరిగింది
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!