Telangana : ఇక్కడ ఫోటోలు దిగితే టమోటాలు ఫ్రీ.. ఫ్రీ..ఫొటోగ్రాఫర్ అదిరిపోయే ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కూరగాయల ధరల మండిపోతున్నాయి.. అందులో టమోటాల ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. రోజు రోజుకు భగ్గుమంటున్నాయి.. ప్రస్తుతం కిలో కేజీ టమాట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నరు. దీంతో టమాటా కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు.. మరికొన్ని చోట్ల కనీవినని రీతిలో ఏకంగా టమాటా చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువుల జాబితాలో ప్రస్తుతం టమాట కూడా చేరిపోయింది. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆలోచన చేశాడు..
మొన్న స్మార్ట్ ఫోన్ కొంటె కిలో టమోటాలను ఆఫర్ చేశాడు ఓ వ్యాపారి.. అలాగే ఈ ఫోటో గ్రాఫర్ కూడా పాస్ పోర్ట్ ఫోటోలను తన స్టూడియోలో దిగితే పావుకిలో టమోటాలను ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు.. ఈ స్టూడియో మన తెలంగాణాలోనే ఉంది.. కొత్తగూడెం బస్టాండ్ కాంప్లెక్స్‌లో ఆనంద్ అనే వ్యక్తికి ఫొటో స్టూడియో ఉంది. గతంలో స్థానికంగా కలెక్టరేట్ ఉన్నప్పుడు వ్యాపారం బాగానే నడిచేది. ఇటీవల జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఇతర ప్రధాన కార్యాలయాలను పాల్వంచ సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయానికి మార్చడంతో గిరాకీ తగ్గింది. గతంలో రోజుకు 20-30 మంది కస్టమర్లు వచ్చేశారు.
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ఇప్పుడు కనీసం రోజుకు ఇద్దరు ముగ్గురు కూడా రావడం లేదు. దీంతో కస్టమర్లను అకట్టుకోవడానికి టమాటా ఆఫర్ ప్రకటించాడు. తన వద్ద రూ.100లకు 8 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించి జనాల దృష్టిని ఆకట్టున్నారు. ఈ మేరకు పట్టణంలోని ప్రధాన రోడ్ల కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు.. ఆనంద్ ఫొటో స్టూడియో ముందు జనాలు బారులు తీరారు.నిన్న ఒక్కరోజే ఏకంగా 32 మంది కస్టమర్లు వచ్చారు. రూ.100 చెల్లించి 8 ఫొటోలు తీసుకున్న వారికి రూ.40 విలువైన పావు కిలో టమాటా ప్యాకెట్లు అందజేసినట్లు’ ఆనంద్ తెలిపాడు. ఆనంద్ వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభించినట్లైంది.. రోజు రోజుకు కస్టమర్లు పెరుగుతున్నారని చెబుతున్నారు.. జానాలు అక్కడ ఫోటోలను దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు..
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!