A Man’s Selfie Video goes viral at Mancherial Railway Station: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి తీసుకున్న సెల్పీ వీడియో కలకలం రేపింది. బీఆర్ఎస్ నాయకుడు వేదింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటా అంటూ తన కుమారుడితో కలిసి ఓ వ్యక్తి సెల్పీ వీడియో తీసుకున్నాడు. తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనపై దాడులకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వేములవాడ రాజన్న…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది. 45 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. మరో 19 మంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం ఇంకా వెల్లడించలేదు. వాటిలో నాలుగు స్థానాలను సీపీఐ, సీపీఎంలకు కేటాయించనుంది.
తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత జాబితా విడుదల అయింది. 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ రెండో విడతలో ప్రకటించిన అభ్యర్థులు వీరే..
హెచ్సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేసిన కేసులో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్పై ఉన్నాయి.
రేపు తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటించనున్నారు. అలాగే, ఎల్లుండి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సైతం టీకాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.